Airport Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్లో అదే పెద్ద అడ్డంకి.. కానీ : ఎన్వీఎస్ రెడ్డి
Airport Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ మ్యాప్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. రాయదుర్గం స్టేషన్ - నానక్‌రామ్‌గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గం అని పేర్కొన్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ మ్యాప్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఇంజినీర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. రాయదుర్గం స్టేషన్ – నానక్‌రామ్‌గూడ జంక్షన్ క్లిష్టమైన మార్గం అని పేర్కొన్నారు. ఈ మార్గంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. 21 మీటర్ల ఎత్తులో మైండ్ స్పేస్ జంక్షన్ దాటడం పెద్ద సవాలు అని చెప్పారు. మైండ్ స్పేస్ జంక్షన్లో అండర్ పాస్, మధ్యలో రోటరీ, పైన ఫ్లై ఓవర్ ఉన్నాయి. మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్ నిర్మాణం చేపడుతామన్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లై ఓవర్ పిల్లర్లకు దూరంగా నిర్మించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ శకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
ఎయిర్ పోర్టు మెట్రో విశేషాలు …
-రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 0.9కిలో మీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్ నిర్మాణం
-ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లుక్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి.
-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా రెండు స్టేషన్లు
-ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణం, తొలి దశలో మూడు బోగీలు మాత్రమే
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ హైలెట్స్
-పొడవు:31 కిలోమీటర్లు (మొత్తం)
-ఎలివేటెడ్ వే: 27.5 కిలోమీటర్లు
-రోడ్ వే: 1 కిలోమీటర్
-అండర్ గ్రౌండ్ వే: 2.5 కిలోమీటర్లు
-వేగం: గరిష్ఠంగా 120 కిలోమీటర్లు
-ఫ్రీక్వెన్సీ: 2.5నిమిషాలు (పీక్ ఆవర్స్)
-సమయం:26 నిమిషాలు
-స్టేషన్లు: 8 లేదా 9 (ప్రతిపాదన ప్రకారం)
-ప్రారంభం: రాయదుర్గం టెర్మినల్ (నూతనంగా)
-నిర్మాణ సమయం: 36 నెలలు
-అంచనా వ్యయం: 6250 కోట్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

