సిటీ బ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆరిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఐడీ ఆధ్వర్యంలో ద్వైవార్షిక ప్రదర్శనను ఇన్ సైడర్ ఎక్స్-2026 పేరిట భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఐఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర్సన్, ఆరిటెక్ట్ ఎన్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ భారీ షోకేజ్‌ను ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ – హైదరాబాద్ రీజినల్ చాప్టర్ (ఐఐఐడీ-హెచ్ఆర్సీ) నిర్వహించబోయే ఈ మూడు రోజుల ప్రదర్శనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ..ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ఆధునిక సమాజాన్ని, దేశ ఆర్థిక వృద్ధిని తీర్చిదిద్దడంలో ‘డిజైన్’ అత్యంత ప్రభావవంతమైనదని తెలిపారు. ప్రజల జీవన విధానం, పనితీరు, నేర్చుకునే పద్ధతులు, ఒకరికొకరు సమన్వయం చేసుకోవడం వంటి విషయాలపై డిజైనింగ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. హైదరాబాద్ నగరం సృజనాత్మకత, వ్యవస్థాపకత, సాంకేతికత, డిజైన్లకు ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎదిగిందని వెల్లడించారు. ఐఐఐడీ చేపట్టే ఈ ప్రదర్శన ఆలోచనలు, ప్రతిభ, ఆవిషరణలు, పరిశ్రమల కలయికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన భవిష్యత్తు డిజైన్ రంగాన్ని తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని పేరొన్నారు. ప్రదర్శనలో ఐఐఐడీ ప్రెసిడెంట్, ఆరిటెక్ట్ జిగ్నేష్ మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ, విదేశాల నుంచి ఆరిటెక్ట్ లు, ఇంటీరియర్ డిజైనర్లు, బిల్డర్లు, కన్సల్టెంట్లు, ట్రేడ్ పార్ట్నర్లు, విద్యార్థులతో పాటు 6వేల మందికి పైగా వ్యాపార సందర్శకులు విచ్చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఐఐడీ షోకేస్ ఇన్ సైడర్ ఎక్స్ 2026 కన్వీనర్, ఐఐఐడీ హెచ్ఆర్సీ గౌరవ కార్యదర్శి ఆరిటెక్ట్ రాకేష్ వాసు సీఎస్, కో-కన్వీనర్, ఐఐఐడీ హెచ్ఆర్సీ కోశాధికారి ఆరిటెక్ట్ నవీన్ చలసాని, ఐఐఐడీ హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ (ట్రేడ్) రమేష్ పటేల్, ఇమ్మీడియట్ పాస్ట్ చైర్పర్సన్ ఆరిటెక్ట్ పల ్లవి అంచూరి, ఆరిటెక్ట్ అమితా రాజ్ తమ అనుభవాలను వివరిస్తారు.
40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరగనున్న ఈ ప్రదర్శనలో 150 పైగా ఎగ్జిబిటర్లు, 300 పైగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ప్రతనిధులు పాల్గొననున్నారు. ఇవి నివాస, వాణిజ్య ఇంటీరియర్స్ కోసం సరికొత్త ఉత్పత్తులు, మెటీరియల్స్, టెక్నాలజీను పరిచయం చేస్తాయని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా రన్ వే తరహాలో ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ కారిడార్, పరిశ్రమలోని ప్రముఖ నిపుణులతో నిర్వహించే నాలెడ్జ్ సెషన్స్, ఇంటర్నేషనల్ కీనోట్స్, విద్యార్థుల కోసం వర్ షాప్‌లు, పోటీలు, ఇంటరాక్టివ్ లెర్నింగ్‌తో కూడిన ప్రత్యేక వేదిక అయిన స్థాపత్య ఉత్సవ్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వెల్లడించారు. ఆరిటెక్చర్, ఇంటీరియర్స్, నిర్మాణ రంగానికి సంబంధించిన భవిష్యత్తును మార్చబోతున్న సరికొత్త ట్రెండ్స్, ఆవిషరణలను ఈ ఈవెంట్ సమగ్రంగా పరిచయం చేయనుందన్నారు. మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు కార్పొరేట్ మీట్ నిర్వహిస్తామని ప్రకటించారు.
1996లో స్థాపించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ – హైదరాబాద్ రీజినల్ చాప్టర్ 450 పైగా సభ్యులతో దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన డిజైన్ కమ్యూనిటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2014లో ప్రారంభమైన ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ దేశంలో అత్యంత ముఖ్యమైన డిజైన్ వేదికల్లో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి ఎడిషన్ డిజైన్ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నది.
2018లో పట్టణ ప్రాంతాల పునర్నిర్మాణం, 2022లో తెలంగాణ కళలు, హస్తకళలు, పర్యావరణహిత మెటీరియల్స్ ప్రదర్శన, 2024లో డిజైన్ ఇంటెలిజెన్స్ అనే ఇతివృత్తంపై ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2026లోనూ అదే ప్రయాణాన్ని కొనసాగిస్తూ… ఆవిషరణలు, సృజనాత్మకత, సాంకేతికత, పరస్పర సహకారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నది. ఐఐఐడీ హెచ్ఆర్సీ తన డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్, వార్షిక పురసారాల ద్వారా సృజనాత్మకత, పర్యావరణ, విశేష విజయాలను గౌరవించడమే కాకుండా.. ఉత్సాహభరిత, సహకారంతో కూడిన భవిష్యత్తుపై దృష్టి సారించిన డిజైన్ వ్యవస్థను పెంపొందిస్తున్నది.