Abids | అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. ఏడు కార్లు దగ్ధం, సెక్యూరిటీగార్డ్ సజీవదహనం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో (Abids) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్యారేజీ (Car garage) మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో (Abids) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబిడ్స్‌లోని బొగ్గుల కుంట కామినేని హాస్పిటల్ (Kamineni Hospital) పక్కనే ఉన్న కారు మెకానిక్ షెడ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా గ్యారేజీ (Car garage) మొత్తానికి మంటలు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ఈ ప్రమాదంలో ఏడు కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు. కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ సంతోష్ సజీవదహనం అయ్యాడని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

