పనిచేసే సంస్థకు కన్నం
ఫైనాన్స్ సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ ఆ సంస్థకే రూ.1.99 కోట్లు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌లో ఎస్ఆర్ఈఐ ఇక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్‌ఈఎఫ్‌ఎల్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ వివిధ వ్యాపారాలకు, వాహనాలకు, నిర్మాణాలకు సంబంధించిన రుణాలు జారీ చేస్తుంది
రూ. 1.91 కోట్లు లూటీ చేసిన సంస్థ మేనేజర్లపై కేసు
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఫైనాన్స్ సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ ఆ సంస్థకే రూ.1.99 కోట్లు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌లో ఎస్ఆర్ఈఐ ఇక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్‌ఈఎఫ్‌ఎల్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ వివిధ వ్యాపారాలకు, వాహనాలకు, నిర్మాణాలకు సంబంధించిన రుణాలు జారీ చేస్తుంది. రుణాలు పొందిన వారు ప్రతి నెల ఈఎంఐలు నగదు, చెక్కులు, ఆన్లైన్ పేమెంట్స్ తదితర మార్గాల ద్వారా చెల్లిస్తుంటారు. ఈ చెల్లింపుల్లో కొన్ని సందర్భాల్లో వివరాలు ఉండకపోవడంతో ఏ కస్టమర్ పంపించాడు.. అనే విషయంలో సందేహాలుంటాయి. వీటిని ఆయా కస్టమర్లకు ఫోన్లు చేసి నిర్ధారించుకున్న తరువాత ఆయా ఖాతాల్లో జమ చేస్తుంటారు.
స్పష్టత వచ్చే వరకు ఆ మొత్తాలను సస్పెన్స్ అకౌంట్లో జమచేస్తుంటారు. ఈ ఖాతాలను ప్రతి సంవత్సరం తనిఖీలు చేసి, ఆయా ఖాతాల లెక్కలు పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే 2021-22కు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తుండగా యజమాన్యానికి లెక్కల్లో లోపాలు కన్పించాయి. ఆ లోపాలపై ఆరా తీయగా అందులో పనిచేసే కొందరు మేనేజర్లు కస్టమర్ల వద్ద నుంచి వచ్చిన డబ్బును తమ సొంతాని వాడుకున్నారు. ఆ తరువాత ఆయా కస్టమర్లకు ఎన్ఓసీలు కూడా జారీ చేసినట్లు వెల్లడైంది. ఇలా రూ. 1,99,18,189 కంపెనీకి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. సస్పెన్స్ ఖాతా నుంచి రూ.5.51 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. పథకం ప్రకారం కంపెనీ డబ్బులు వాడుకొని మోసం చేసిన మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంస్థ జోనల్ లీగల్ మేనేజర్ చంద్రశేఖర్‌రావు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

