బేగంపేట్ ఫిబ్రవరి 29: ఓ బాలిక నగ్న చిత్రాలను ఆమె తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్న యువకుడికి నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ న్యాయస్థానం మూడేండ్ల జైలు శిక్షతో పాటు 5వేల జరిమానా విధించింది.
బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి కుమార్తెతో అదే ప్రాంతంలో ఉండే సురేశ్(21) చనువుగా ఉండి.. ఆమె నగ్న ఫొటోలను సేకరించాడు. వాటిని బాలిక తండ్రికి పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు.
బాధితుడు బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నారు. న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు.. నిందితుడికి శిక్షను ఖరారు చేసింది.