సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ) : విద్యార్థినులకు అశ్లీల ఫొటోలు పంపుతూ.. వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడికి 15 రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ హాస్టల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినుల వాట్సాప్ నంబర్‌కు గత 25 రోజులుగా అశ్లీల ఫొటోలు, మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో విద్యార్థినులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు.
వెంటనే దర్యాప్తును ప్రారంభించిన షీటీమ్స్ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తిని బోరబండ పాండురెడ్డినగర్కు చెందిన విజయ్‌కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా.. పదవ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నిందితుడికి 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పును వెల్లడించింది.