ఆత్మహత్యాయత్నం.. యువకుడి ప్రాణాలు కాపాడిన కీసర పోలీసులు
Keesara Police | కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడి ప్రాణాలను కీసర పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కీసరకు చెందిన 30 ఏండ్ల యువకుడు భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ జీవనం

హైదరాబాద్ : కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడి ప్రాణాలను కీసర పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కీసరకు చెందిన 30 ఏండ్ల యువకుడు భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరేసుకునేందుకు యత్నించాడు.
ఈ విషయాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు 100 డయల్ చేయడంతో క్షణాల్లోనే పెట్రోల్ మొబైల్ వెహికల్, బ్లూ కోట్ సిబ్బంది రాములు, మహేందర్, శానూర్ బాబుమ్, సురేందర్ ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడు ఉన్న గదిలోకి ప్రవేశించి.. ఉరేసుకునేందుకు యత్నిస్తుండగా ఆపారు. అతని ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. క్షణాల్లో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రశంసలు కురిపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

