హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో (Film nagar) దారుణం చోటుచేసుకున్నది. ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌లో తన భార్యను వేధిస్తున్నాడనే అనుమానంతో సొంత తమ్ముడిని అన్న నరికి (Murder) చంపాడు. షబ్బీర్ అహ్మద్, సాజిద్ అన్నాదమ్ములు. సాజిద్ తన భార్యను వేధిస్తున్నాడని షబ్బీర్.. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి.. నిందితుడు షబ్బీర్‌ను అరెస్టు చేశారు. హత్యకుగల కారణాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.