హరితహారాన్ని విజయవంతం చేద్దాం

కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 22 : హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం మూసాపేట సర్కిల్లోని ముళ్లకత్వ నర్సరీని జడ్సీ మమత, డీసీ రవికుమార్, బయో అర్బన్ డైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూకట్పల్లి జోన్ పరిధిలో ఉన్నతాధికారులు నిర్దేశించిన హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్కిల్లోని ప్రతీ వార్డులో నర్సరీలను అందుబాటులోకి తెచ్చి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఇంటింటికీ పంపిణీ చేసే పూలు, ఔషధ మొక్కలతో పాటు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలలో నాటే మొక్కలను కూడా పెంచడం జరిగిందన్నారు. కాలనీలలో ప్రజలకు అందుబాటులో నర్సరీలను ఉంచామని ఉచితం గా మొక్కలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే హరితహారాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆయా కాలనీలు, బస్తీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో సమావేశాలు నిర్వహించడం, ప్రజలందరినీ భాగస్తులను చేస్తూ హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

