రాంగ్ పార్కింగ్.. 20 వేల కేసులు
రాంగ్‌సైడ్ పార్కింగ్‌పై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా గత వారం 14 వేల కేసులు నమోదు చేయగా, మంగళవారం ఒక్క రోజే 6,332 కేసులు నమోదు చేశారు. ఒక్క రాంగ్‌సైడ్ పార్కింగ్ ఉల్లంఘనపైనే 20 వేల కేసులు నమోదు చేశారు. రాంగ్‌సైడ్ పార్కింగ్ అనేది చిన్న సమస్యగా కనిపించినా.. అది ట్రాఫిక్‌కు ఎంతో అంతరాయం కలుగుతున్నదంటూ.. పోలీసులు చెబుతున్నారు.
- చిన్న దుకాణాలపైనే దృష్టి..‘బడా సముదాయాల’పై నో ఫోకస్
- మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్డ్రైవ్పై విమర్శలు
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): రాంగ్‌సైడ్ పార్కింగ్‌పై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా గత వారం 14 వేల కేసులు నమోదు చేయగా, మంగళవారం ఒక్క రోజే 6,332 కేసులు నమోదు చేశారు. ఒక్క రాంగ్‌సైడ్ పార్కింగ్ ఉల్లంఘనపైనే 20 వేల కేసులు నమోదు చేశారు. రాంగ్‌సైడ్ పార్కింగ్ అనేది చిన్న సమస్యగా కనిపించినా.. అది ట్రాఫిక్‌కు ఎంతో అంతరాయం కలుగుతున్నదంటూ.. పోలీసులు చెబుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు పార్కింగ్ సౌకర్యం లేని దుకాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. పార్కింగ్ స్థలం లేకుండా వ్యాపారం ఎలా నడిపిస్తున్నారు..? అనే విషయాలపై దృష్టి పెట్టడం లేదు. వ్యాపారం చేసే సమయంలోనే తగిన పార్కింగ్ ఉండాలనే నిబంధన ఉంది. దానిని ఎందుకు అమలు చేయడం లేదు. రోడ్లను బ్లాక్ చేసి మందు బాబులకు అడ్డగా సర్వీస్రోడ్లను మార్చుకుంటున్న మద్యం దుకాణాలు.. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద ఎందుకు జరిమానాలు వేయడం లేదు.. పెద్ద పెద్ద దుకాణాల వద్ద రాంగ్ పార్కింగ్‌ల విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పార్కింగ్ విషయంలో కొందరు ట్రాఫిక్ పోలీసులు నెలవారీగా మాముళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. నగరంలో పలు వ్యాపార సముదాయాలకు పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. దీంతో రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తున్నది. అయితే పోలీసులు కేవలం చిరు దుకాణాలనే ఈ అంశంలో టార్గెట్ చేస్తున్నరన్న విమర్శలు వస్తున్నాయి. బడా షాపుల వద్ద వాహనాల పార్కింగ్‌కు తగిన సౌకర్యాలు లేకపోయినా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
వాహనాలకు అనుగుణంగా..
పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలు ఉండాలి, కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిరు వ్యాపారులకు వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి కావాల్సిన స్థలాలను కేటాయించడంలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ నుంచి రెసిడెన్సియల్ కోసం అనుమతి పొంది..నేడు ఎంతో మంది వాణిజ్యపరంగా భవనాలను ఉపయోగిస్తున్నారు. సామాన్య పౌరులు షాపింగ్ కోసం ఆయా వ్యాపార సముదాయల వద్దకు వెళ్తుంటారు. అక్కడ పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను పార్కు చేస్తున్నారు. అయితే రాంగ్‌సైడ్ పార్కింగ్ వాహనదారులు ఎందుకు చేస్తున్నారు? ఎక్కడ ఎక్కువగా రాంగ్‌సైడ్ పార్కింగ్ చేస్తున్నారు? అక్కడ సమస్య ఏంటీ అనే విషయాలను కూడా ఉన్నతాధికారులు లెక్కలు తీయాల్సిన అవసరమున్నది.
ఇలాంటి లెక్కలతో అక్కడి సమస్యను గుర్తించి పరిష్కార మార్గాలు చూపించాలి. వ్యాపార సముదాయల వద్ద ఎక్కువగా సమస్య వస్తుందంటే.. ఆయా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి.. మీ దుకాణం వద్ద రాంగ్ పార్కింగ్ ఉందంటే ఆ చాలన్లు మీరే కట్టాలనే కఠినమైన నిబంధనలు పెట్టడం, వారికి నోటీసులు ఇవ్వడం… వాహనదారులకు కన్పించే విధంగా నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం వంటి కనీస చర్యలైనా ట్రాఫిక్ పోలీసులు తీసుకోవాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. అలా కాకుండా ఉల్లంఘనలపై చలాన్లు వేయడమే మా డ్యూటీ అన్నట్లుగా విధులు నిర్వహిస్తే, సమస్య పరిష్కారం కాకుండా, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడడమే కాకుండా, ట్రాఫిక్ సమస్య కూడా మరింత పెరిగే అవకాశాలుంటాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

