జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23: పట్టు చీరలకు మహారాణి కాంచీపురం పట్టు.. పనితనంలో మేటి.. కళాత్మకతలో లేదు సరిసాటి.. నైపుణ్యానికి నిలువెత్తు సంతకం.. వంటి కాంచీపురం సిల్క్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. విలాసాల వీధుల్లో విహరింపజేస్తాయి.
తమిళనాడులోని ఆలయాల నగరం నుంచి.. అందాల విందులు చేసే ఈ పట్టు చీరలు అనేక శతాబ్దాలుగా భారత సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా వర్ధిల్లుతున్నాయి. చెక్కుచెదరని నాణ్యతకు, చిరకాల మన్నికకు ఖ్యాతికెక్కాయి. కాంచీపురం పట్టును ధరించడం తరతరాల తరగని వేడుక. మాటలకు అందని మహత్తరమైన కానుక.
‘జూబ్లీహిల్స్ కాంచీపురానికి రహదారి..’ నినాదంతో ఈ షోరూమ్ హైదరాబాద్‌ను పట్టుచీరల గమ్యంగా తీర్చిదిద్దింది. జూబ్లీహిల్స్‌ను కాంచీపురంగా ఆవిష్కరించింది. అందువల్ల మీరు కాంచీపురం వరకు ప్రయాణించాల్సిన పనిలేదు. జూబ్లీహిల్స్‌లోని మా మంగళగౌరీ గ్రాండియర్‌లో అడుగుపెడితే చాలు..!
అత్యున్నతస్థాయికి చెందిన సాంస్కృతిక వారసత్వానికి చెందిన కాంచీపురం పట్టును మీకు సమర్పించడాన్ని మంగళగౌరీ గ్రాండియర్ గర్వకారణంగా భావిస్తోంది.
అన్ని విధాలుగా సరికొత్తదనాన్ని సంతరించుకున్న ఈ షోరూమ్‌లో విశేషమైన శ్రేణికి చెందిన కళాత్మక పట్టు చీరలు మీ విలాసవంతమైన జీవన శైలికి రెట్టింపు హుందాతనాన్ని తీసుకువస్తాయి. కాంచీపురం పట్టు చేనేత కళాకారుల పనితనంతో పాటు ధర్మవరం, ఆరణి, గద్వాల్, ఉప్పాడ, పోచంపల్లి, మహేశ్వరి, పైథాని, వెంకటగిరి, ఇక్కత్, పటాన్ పోటాల, కోల్కత్తా, కోయంబత్తూర్, బెనారస్, చందేరి వంటి వైవిధ్యభరితమైన శ్రేణులు మీ అభిరుచికి అద్దం పడుతున్నాయి.
మొదటి అంతస్తులో ప్యూర్ ఆరేంజ్, ప్యూర్ ఖాదీ జార్జెట్టా, తాగిల్ జార్జెట్టా, ఆల్ ఫ్లోరల్ పెయింట్స్, బిన్నీ క్రేప్, సిల్క్స్, లీనెస్ జ్యోత్స్, మట్కా సిల్క్స్, ప్యూర్ బండేజ్, ఫ్యాన్సీ పట్టు, ప్యూర్ జరీ కొటాస్, ఫ్యాన్సీ చినియా పట్టు వంటివి అభిరుచికి తగినట్టుగా అందుబాటులో ఉన్నాయి. 2021 అక్టోబర్ 9న దార్శనికుడు కృష్ణమూర్తి గారిచే నెలకొల్పబడిన మీ ‘మంగళ గౌరీ’ కంపెనీ సాంప్రదాయక పట్టు వెరైటీలకు పట్టాభిషేకం చేస్తోంది. అసాధారణమైన పరిజ్ఞానాన్ని, పనితనాన్ని, నైపుణ్యాన్ని మేళవించిన పట్టు చీరలను అందించడంలో అగ్రశ్రేణి సంస్థగా మీ అభిమానాన్ని చూరగొంది.
కేవలం రీ టైలర్ స్థాయిని అధిగమించి, సంప్రదాయాన్ని, అధునాతనతనూ మేళవించిన పట్టు వెరైటీలను కంచి చేనేత కళాకారులు విక్రయిస్తున్న ధరలకే మీ కాంచీపురం మంగళ గౌరీ మీకు అందిస్తోంది. ప్రతిపట్టు వెరైటీలో భారతీయ సంప్రదాయాలకు పట్టం కట్టే కాంచీపురం మంగళ గౌరీకి విచ్చేయండి. మీ అభిరుచికి అద్దం పట్టే వైవిధ్యభరితమైన పట్టు రకాలతో మీ సౌందర్యానికి పట్టం కట్టండి. రోడ్డు నంబర్ 36, పిల్లర్ నంబర్ 1628, జూబ్లీహిల్స్.