కొవిడ్ బాధితులకు ఊపిరితిత్తుల మార్పిడి

హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో రికార్డు సృష్టించామని ‘కిమ్స్’ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12 కొవిడ్ డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. మొత్తంగా 50 ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్ప్లాంటేషన్లను విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీ భాస్కర్‌రావు తెలిపారు. ఇది ఆసియా ఖండంలోనే అరుదైన రికార్డని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని కిమ్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జమ్మూకశ్మీర్, పంజాబ్, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ తదితర రాష్ర్టా ల నుంచి ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తమ దవాఖానకు వచ్చారని, అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ సపోర్ట్‌తో వారి ప్రాణాలు కాపాడామని చెప్పారు. కరోనా బారినపడి తీవ్రమైన రెస్పిరేటరీ సమస్యలతో తమ దవాఖానల్లో చేరినవారిలో 12 మందికి ఊపరితిత్తుల మార్పిడి చేయడం ఆసియాలోనే రికార్డని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

