బ్యాంకు లింకేజీ లేకుండా ఎస్సీ నిరుద్యోగులకు రుణాలు
ఎస్సీ నిరుద్యోగులకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాన్ని బ్యాంకుకు లింకేజీ లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలను అందజేయనుంది
మేడ్చల్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఎస్సీ నిరుద్యోగులకు రుణాలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాన్ని బ్యాంకుకు లింకేజీ లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలను అందజేయనుంది. రూ. లక్ష విలువగల యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రూ. లక్ష యూనిట్‌కు లబ్ధిదారుడు రూ. 20 వేలు చెల్లిస్తే ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ. 80 వేల సబ్సిడీ అందిస్తుంది. ఈ స్కీమ్‌లో గేదే లేదా ఆవు, 10+1గొర్రెలు, ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లతో పాటు ఇతర లాభదాయకమైన యూనిట్టకు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హత ఉన్న లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయనుంది.
రుణాలు పొందడానికి కావాల్సిన పత్రాలు..
లక్ష రూపాయల యూనిట్‌ను పొందడానికి మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు , పాన్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. దరఖాస్తులను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ నిరుద్యోగులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రూ. లక్ష విలువ గల యూనిట్‌ను ఎంపిక చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి. లక్ష రూపాయల యూనిట్‌కు రూ.80 వేలు ప్రభుత్వమే సబ్సిడీ అందిస్తుంది. ఎస్సీ నిరుద్యోగులు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన అనంతరం యూనిట్లను మంజూరు చేస్తాం. బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా ప్రభుత్వమే సబ్సిడీపై రుణాలు అందజేస్తుంది.
– బాలాజీ , జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

