ఖరీదెక్కిన టర్మ్ ఇన్సూరెన్స్
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.
- 10 శాతం వరకు ప్రీమియం ధరల్ని పెంచిన ప్రముఖ సంస్థలు
- వృద్ధుల దగ్గర్నుంచి అన్ని వర్గాలపై పెరిగిన భారం
- పెంపు బాటలో మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు
- ప్రభుత్వ సంస్థలు మాత్రం దూరం
న్యూఢిల్లీ, జూలై 10: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి. భారతీయ మూడో అతిపెద్ద జీవిత బీమా సంస్థ, రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బీమా సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్.. తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను దాదాపు 10 శాతం మేర పెంచినట్టు చెప్తున్నారు. అయితే 60 ఏండ్లకుపైబడినవారికే ఈ పెంపు వర్తిస్తుందని అంటున్నారు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం వ్యక్తిగత వార్షిక ప్రీమియంల విలువలో 5 శాతానికి సమానంగా దాని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వాటా ఉన్నది.
మిగతా వాటిలో..
మరో ప్రైవేట్ రంగ బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను 1 నుంచి 6 శాతం మేర పెంచింది. ఆయా వయసులనుబట్టి ఈ పెంపులున్నాయి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యక్తిగత వార్షిక బీమా ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 9 శాతం. ఇక బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల రేట్లు 1 నుంచి 5 శాతం మేరకు పెరిగాయి. టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలూ 3 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వార్షిక ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 6 శాతంగా ఉన్నది.
ఇదే బాటలో..
మరికొన్ని కంపెనీలూ తమ బీమా ప్రీమియంల రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల ధరలు 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రం పెంపునకు నో అంటున్నాయి. ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పటికైతే పెంచబోవడం లేదంటున్నాయి. కాగా, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, జనాభా, స్థిరం గా సాగతున్న రీఇన్సూరెన్స్ ఖర్చుల నేపథ్యంలోనే ప్రీమియంల ధరల్ని సవరించాల్సి వస్తున్నదని బీమా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో టర్మ్ ఇన్సూరెన్స్లకు పెరుగుతున్న ఆదరణ కూడా రేట్ల పెంపునకు కారణమేనన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

