DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand | 1997లో తాను నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన సమయంలో 126 మంది పోలీసులు అమరులైన ఘటనను గుర్తుచేస్తూ, మందుపాతరలు, కాల్పులు, పోలీసు సిబ్బందిపై దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
DGP CV Anand | ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తీవ్రవాదం, నక్సలిజం, మావోయిజం, ఇతర అసాంఘిక శక్తులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని, నక్సలైట్ల హింసను ఎదుర్కొనే క్రమంలో వందలాది మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి ధైర్యసాహసాల ఫలితంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడి అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కర్రెగుట్టల వంటి మారుమూల ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేయడం పోలీసుల పట్టుదలకు నిదర్శనమన్నారు. 1997లో తాను నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన సమయంలో 126 మంది పోలీసులు అమరులైన ఘటనను గుర్తుచేస్తూ, మందుపాతరలు, కాల్పులు, పోలీసు సిబ్బందిపై దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసుల్లో తెలంగాణకు చెందిన ఏఎస్ఐ దేవ్‌సింగ్, కానిస్టేబుళ్లు ఎంపల్లి ప్రమోద్‌కుమార్, శీలం కరుణాకర్ ప్రాణ త్యాగం చేశారన్నారు.
పండుగలు, సెలవు రోజుల్లోనూ ప్రజల భద్రత కోసం విధులు..
పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందేలా చూడాలని అన్నారు. పండుగలు, సెలవు రోజుల్లోనూ ప్రజల భద్రత కోసం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)ను ప్రారంభించారని, ప్రస్తుతం సుమారు 350 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంచిరేవులలో శాశ్వత క్యాంపస్ ఏప్రిల్ నాటికి పూర్తయితే సుమారు 720 మంది విద్యార్థులకు విద్య అందించే అవకాశం ఉంటుందని, పోలీసు సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.
సేవాభావంతో విధులు నిర్వర్తించాలి..
మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు, వ్యవస్థీకృత నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిబ్బంది నిరంతరం నైపుణ్యాలు పెంపొందించుకుని, ఇన్ సర్వీస్ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆధునిక నేరాల నియంత్రణతోపాటు ప్రాథమిక, విజిబుల్ పోలీసింగ్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ ఫోర్స్, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టి-మార్స్, ఆహార కల్తీ నియంత్రణకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం ద్వారా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
తెలంగాణ జనాభాలో కేవలం 0.3 శాతం మందికే పోలీసు యూనిఫాం ధరించి ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు చట్టప్రకారం, నిజాయతీతో పరిష్కారం చూపాలని, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తూ ప్రజలకు నిబద్ధతతో సేవలందించడమే పోలీసు అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
Read Also :
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ప్రమాదాలు జరిగిన పట్టించుకోరా..? రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలంటూ ధర్నా
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

