Driving | మేము సైతం స్టీరింగ్ పట్టి గేర్ మారుస్తాం.. డ్రైవింగ్‌పై యువతులు, గృహిణుల ఆసక్తి
స్టీరింగ్ తిప్పుతూ..గేరు మార్చుతూ మహిళలు రోడ్లపై వాహనాలను పరుగెత్తిస్తున్నారు. నగరంలో స్కూటీ, కారు డ్రైవింగ్ నేర్చుకోవడంపై యువతులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు.
- గత ఏడాది 42,557 లైసెన్స్‌లు జారీ
- ఈ ఏడాది ఇప్పటి వరకు 1765 లైసెన్స్‌లు
- రాష్ట్రంలో లైసెన్స్ జారీలో గ్రేటర్ వాటే అధికం
Driving | సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ) : స్టీరింగ్ తిప్పుతూ..గేరు మార్చుతూ మహిళలు రోడ్లపై వాహనాలను పరుగెత్తిస్తున్నారు. నగరంలో స్కూటీ, కారు డ్రైవింగ్ నేర్చుకోవడంపై యువతులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ తీసుకొని డ్రైవింగ్ టెస్ట్‌లకు హాజరవుతూ లైసెన్స్ పొందుతున్నారు. నగర బిజీ జీవితంలో ఇప్పుడు వాహనం నడపడం అనివార్యంగా మారింది.
కార్యాలయాలకు వెళ్లడం.. పిల్లలను స్కూల్ వద్ద డ్రాప్ చేయడం.. తిరిగి ఇంటికి తీసుకురావడం.. పండుగలకు ఊరెళ్లడం.. ఇలా మహిళలకు డ్రైవింగ్ తప్పనిసరిగా మారింది. గతంలో సిటీలోని మొత్తం డ్రైవింగ్ లైసెన్సులలో ఒకటి, రెండు శాతంలోనే ఉండేది మహిళల సంఖ్య. కానీ, ఇప్పుడు 50 శాతం వరకు లైసెన్స్‌లో వారీ వాటా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 42,557 మంది మహిళలు లైసెన్స్ పొందగా ఈ ఏడాది ప్రస్తుతం వరకు 1765 మంది లైసెన్స్ పొందారు.
కారుకే జై..!!
గ్రేటర్లో సుమారు 400లకు పైగా డ్రైవింగ్ సూళ్లు ఉన్నాయి. వీటితోపాటు మరో 50 నుంచి 60 వరకు మారుతి, టయోటా లాంటి కంపెనీ డ్రైవింగ్ సూళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకో బ్యాచ్‌కు కనీసం 20నుంచి 35 మంది చొప్పున కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 2019 నుంచి ఇప్పటి వరకు 1.57 లక్షల మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇందులో అధిక భాగం ఫోర్ వీలర్ లైసెన్స్ ఉన్నవాళ్లే. గ్రేటర్లో మొత్తం 4.27 లక్షలకు పైనే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మహిళలు ఉన్నారని ఆర్టీఏ లెక్కలు చెబుతున్నాయి
సరైన శిక్షణ తీసుకోవాలి..
డ్రైవింగ్ నేర్చుకోవడానికి మహిళలు చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అందులోనూ ఫోర్ వీలర్ లైసెన్స్ పొందే వారి సంఖ్య అధికం. నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న డ్రైవింగ్ స్కూళ్లలోనే శిక్షణ తీసుకోవాలి. రోడ్డు నిబంధనలన్నీ క్షుణ్ణంగా గుర్తించుకోవాలి. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఆలస్యమైనా పర్లేదు కానీ వచ్చిరానీ డ్రైవింగ్‌తో లైసెన్స్ పొందాలని ప్రయత్నిస్తే కుదరదు. ఆర్టీఏ నిర్వహించే అన్ని టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి.
– రవీందర్ కుమార్, ఆర్టీఓ, ఉప్పల్.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

