చేయిచేసుకొని.. బూతులు తిట్టి..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించాడు. నో పార్కింగ్ జోన్లో లారీని నిలిపాడన్న కారణంతో డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా.. బండబూతులు తిట్టాడు.
- లారీ డ్రైవర్‌ను దుర్భాషలాడిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. డీజీపీకి ట్వీట్
- ఆమోదయోగ్యమైన భాషేనా అది..అంటూ అభ్యంతరం
- ఎస్ఐని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసిన పోలీస్ బాస్
దుండిగల్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఎస్ఐ అనుచితంగా ప్రవర్తించాడు. నో పార్కింగ్ జోన్లో లారీని నిలిపాడన్న కారణంతో డ్రైవర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా.. బండబూతులు తిట్టాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు.
‘ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి.. బూతుల పోలీసింగ్ వచ్చేనం’టూ డీజీపీకి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ.. సదరు ఎస్ఐని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్ వైపు వెళ్తున్న ఓ లారీని బుధవారం నో పార్కింగ్ జోన్లో నిలిపాడు డ్రైవర్. సిబ్బందితో కలిసి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి డ్రైవర్‌ను లారీ తీయాలని సూచించాడు.
లారీ ఆగిపోయిందని.. కొద్దిసేపట్లో తీస్తానని చెప్పడంతో ఎస్ఐ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తిట్ల పురాణం అందుకొని.. చేయిచేసుకున్నాడు. ఇదంతా ఓ బాటసారి తన ఫోన్లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరలయ్యింది. ఈ క్రమంలో డ్రైవర్స్ యూనియన్ నాయకులు డ్రైవర్లతో కలిసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ముందు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ఎస్ఐ యాదగిరి, పోలీస్సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..సీఐకి వినతిపత్రం అందజేశారు.
కాగా, సదరు ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ..ట్వీట్ చేశారు. ‘పౌరుల పట్ల పోలీసులు వ్యవహరించే విధానం ఇదేనా..’? పోలీసులకు, పోలీసు యంత్రాంగానికి ఆమోదయోగ్యమైన భాషేనా.. అది’ అంటూ ప్రశ్నించడంతో పాటు నో పార్కింగ్ జోన్లో లారీని నిలిపితే డ్రైవర్‌ను అంతనీచంగా తిట్టాలా…? పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారు..
గుర్తుంచుకోవాలి..ఇదొక్కటే కాదు.. ప్రతినిత్యం ఇలాంటివి సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నామం’టూ కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన డీజీపీ జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకున్నారు. హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించినట్లు జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Criticism
- Jeedimetla
- KTR
- slapping
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

