కెమికల్ రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం

జీడిమెట్ల, జూలై 28 : జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని శ్రీ వేంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలో ఉన్న నాసెన్స్ ల్యాబ్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో బుధవారం ఏ షిఫ్ట్‌లో 54 మంది కార్మికులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. కొంతమంది కార్మికులు రియాక్టర్, బాయిలర్ వద్ద పనుల్లో నిమగ్నమై ఉండగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.
షిఫ్ట్ ఇన్చార్జి హరిప్రసాద్‌రెడ్డి(42)కి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. కార్మికుడు నంద కిషోర్ (28) ఘటన సమయంలో కంపెనీ గోడ దూకడంతో కాలు విరిగింది. మరో కార్మికుడు అర్జున్ (28) తలకు స్వల్ప గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ఇంజిన్ సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. కార్మికులు అల్పాహారం కోసం డైనింగ్‌హాల్‌కి వెళ్లిన సమయంలో పేలుడు సంభంవించడంతో ప్రాణనష్టం జరగలేదు.
సందర్శించిన అధికారులు
అగ్ని ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ డీఎఫ్ఓ డి.సుధాకర్‌రావు, బాలానగర్ ఎసీపీ పురుషోత్తం యాదవ్, జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, ఫైర్ అధికారులు, సిబ్బంది ఘటనా సస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

