జయలక్ష్మీదేవీ జీ ఆర్య కన్నుమూత

- ఆర్య సమాజం తొలి మహిళా అధ్యక్షురాలిగా విశేష సేవలు
- ఆర్య కన్య పాఠశాలకు కరస్పాండెంట్‌గా సేవలందించిన మహా సేవకురాలు
సుల్తాన్‌బజార్ ఆర్య సమాజం తొలి మహిళా అధ్యక్షురాలు, ఆర్య కన్య పాఠశాల కరస్పాండెంట్‌గా సేవలందించిన జయలక్ష్మీదేవీ జీ ఆర్య (90) ఆదివారం అర్ధరాత్రి తమ నివాసంలో కన్నుమూశారు. తమిళనాడులో పుట్టిన ఆమె మహర్షి దయానంద సరస్వతి సాహిత్యాన్ని అధ్యయనం చేసి వైదిక జీవనాన్ని అలవర్చుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, సుప్రసిద్ధ ఆర్య సమాజ్ నాయకులు సత్యనారాయణ ముల్కి కుమారుడు ఘట్కేసర్ గురుకుల స్నాతకులు దేవనాథ్ ఆర్యను వైదిక పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అనంతరం మలక్‌పేట్‌లోని దయానంద్‌నగర్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.
సుల్తాన్‌బజార్ ఆర్య సమాజ్ తొలి మహిళా అధ్యక్షురాలిగా, దేవీదీన్బాగ్లోని ఆర్య కన్య పాఠశాలకు కరస్పాండెంట్‌గా సేవలందించారు. ప్రస్తుతం, జయలక్ష్మీదేవీ జీ ఆర్య కుమారుడు సోమనాథ్ ఆర్య కరస్పాండెంట్‌గా సేవలంది స్తున్నాడు. జయలక్ష్మీ దేవీ జీ ఆర్య సమాజం,ఆర్య కన్య పాఠశాలతో ఎంతో మందికి సేవలందించారని ఆర్య సమాజం, టీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఎంపీ రామచంద్రరాజు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం జయలక్ష్మీ దేవి పార్థీవ దేహానికి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

