సిటీబ్యూరో, ఏప్రిల్ 68 (నమస్తే తెలంగాణ): తుక్కుగూడలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణ పనులను బుధవారం డీజీపీ శివధర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబుతో కలిసి పరిశీలించారు. తుక్కుగూడ ఫ్యాబ్‌సిటీలో డీజీపీ పర్యటించి నిర్మాణంలో ఉన్న వివిధ అధికారిక భవనాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కమిషనర్ కార్యాలయంలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మాణాలు ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించారు.
అనంతరం మీర్ఖాన్పేట్ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను, అక్కడ భవిష్యత్తులో నిర్మించాల్సిన శాశ్వత భవనాలు, మాస్టర్ ప్లాన్‌పై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఏసీపీ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.