సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): ఫార్మా రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే లక్ష్యంగా ఆవిష్కరణ ఫౌండేషన్ సంస్థ టీ హబ్తో ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలకు కేంద్రంగా టీ హబ్తో కలిసి పనిచేసేందుకు ఆవిష్కరణ ఫౌండేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావుతో సమావేశంపై ఆవిష్కరణలపై అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేస్తున్నట్లుగానే ఫార్మా రంగంలోనూ వినూత్న ఆవిష్కరణలు చేసేందుకు టీ హబ్తో కలిసి పనిచేసేందుకు ఆవిష్కరణ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని సీఈఓ తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా రంగం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు ఆర్ అండ్ డీ విభాగాల్లో వందలాది ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉండడంతో ఇది సరైన వేదికగా భావించిన ఆవిష్కరణ ఫౌండేషన్ తమతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.