CRMP | సీఆర్ఎంపీ అటకెక్కిందా?.. మూడునెలలైనా కొత్తప్రాజెక్టుల ఊసెత్తని కాంగ్రెస్ ప్రభుత్వం
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఆటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదు.
- గ్రేటర్ స్ఫూర్తిగా ఢిల్లీ, ఇతర మెట్రో నగరాల్లో సీఆర్ఎంపీ విధానం అమలు
- గత ప్రభుత్వ హయాంలో విజయవంతంగా మొదటి దశ పూర్తి
- కొత్త సర్కారు ముందు రూ. 696.71 కోట్లతో జీహెచ్ఎంసీ రెండో విడత ప్రతిపాదనలు
CRMP | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం కింద రెండో దశ పనులు చేపట్టాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదన ఆటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సీఆర్ఎంపీ రెండో దశలో రూ.696.71 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరినప్పటికీ సర్కారు నుంచి ఎలాంటి పరిపాలన అనుమతులు లభించలేదు. దీంతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు, కమిషనర్ సైతం సీఆర్ఎంపీ రెండో దశపై సమీక్ష జరపడం లేదు. ఫలితంగా ఇప్పట్లో రెండో దశ పనులు ప్రారంభం కావడం కష్టసాధ్యంగానే మారింది.
కాగా గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ పధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020 సంవత్సరంలో అప్పగించారు. దాదాపు రూ.1050కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా.. ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు. ఇటువంటి పథకాన్ని కొత్త ప్రభుత్వం చేపట్టేందుకు ముందుకు రాకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

