గతంలో ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి.. మంద కృష్ణ మాదిగ డిమాండ్
ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని అన్నారు.
కవాడిగూడ, మార్చి 10 : ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని అన్నారు.
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సోమవారం జరిగిన రిలే నిరాహార దీక్షలకు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని గతంలో ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చట్టం (రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఆక్ట్ 2000) రూపొందించారని తెలిపారు. ఆ చట్టంలో గతంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు వర్గీకరణ సూత్రం వర్తింపజేసేలా 4వ నిబంధనను పొందుపరిచారని చెప్పారు. ఆ చట్టాన్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలించాలని సూచించారు. గతంలో ఇచ్చిన నోటిషికేషన్లో వర్గీకరణ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టడం సాధ్యం కాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చూపెట్టిన నిజాయితీని రేవంత్‌రెడ్డి చూపెడితే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. వర్గీకరణ వ్యతిరేక తీర్పును వేగంగా అమలు చేశారని, వర్గీకరణ అమలు తీర్పును అమలు చేయడానికి కొర్రీలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్సే అధికారంలో ఉందని గుర్తుచేశారు.
ఎస్సీ ఉద్యోగాలను మాలలకు దోచిపెట్టడమే కాంగ్రెస్ విధానమని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఓ వైపు ఎస్సీ వర్గీకరణ చట్టం వస్తుందని చెబుతూనే.. మరోవైపు చట్టం రాకముందే ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని అన్నారు. గ్రూప్ 1, 2, 3, డబ్ల్యూహెచ్‌వో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తదితర అన్ని ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాలల కోసం మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీక్షలు కొనసాగుతున్నాయని తర్వాత శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని అన్నారు.తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముట్టడిలు చేపడతామని ఆయన తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

