కొంతమోని కుంట కబ్జా
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 273లోని కొంతమోని కుంటపై కబ్జాదారుల కన్నుపడింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతున్నది.
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న హైడ్రా యంత్రాంగం
- వెలుస్తున్న అక్రమ వెంచర్లు
- స్థానికుల ఫిర్యాదుతో అధికారుల పరిశీలన
- హస్తం నేతల బెదిరింపులతో చర్యలకు వెనకడుగు
- యథేచ్ఛగా ఆక్రమణల పర్వం
- కాగితాలకే పరిమితమైన చెరువుల పరిరక్షణ
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 273లోని కొంతమోని కుంటపై కబ్జాదారుల కన్నుపడింది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమ వెంచర్లు వె లుస్తున్నా.. హైడ్రా సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానికుల ఫిర్యాదు మేరకు కుంటను పరిశీలించిన అధికారులు.. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో చర్యలకు వెనకడగు వేసినట్లు ఆరోపణలు వినిస్తున్నాయి.
చెరువుల పరిరక్షణ కాగితాలకే పరిమితమవుతున్నది. కబ్జామయమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు కట్టలను ధ్వంసం చేయడం.. నాలాలను పూడ్చివేయడం.. చెరువుల్లో రాత్రికి రాత్రి మట్టి పోసి వెంచర్లు చేయడం నిత్య కృత్యమైపోయాయి. నీటి పారుదల శాఖ అధికారులు..నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప..చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా, ఆక్రమణాదారులు కొంత మోని కుంటను కొల్లగొడుతున్నారు.
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 273లో ఈ కుంట ఉంది. భూమి 3 ఎకరాలుండగా, ఎఫ్టీఎల్, బఫర్ ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కొంత మోని కుంట బాలాపూర్, కొత్తపేట రెండు రెవెన్యూ గ్రామాల సరిహద్దులో ఉంది. బడంగ్పేట్, జల్పల్లి రెండు సర్కిల్ కార్యాలయాల సరిహద్దులో ఉంటుంది. కుంట కబ్జాకు గురవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు. హైడ్రా సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
బడంగ్పేట్, నవంబర్ 6 : అధికారుల ఉదాసీనత వల్లే చెరువులు అక్రమణకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు పరీవాహక ప్రాంతాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమిస్తున్నారు. వెంచర్లు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ‘అధికారులు నోటీసులు జారీ చేసి మా పని అయిపోయింద’ని చేతులు దులుపుకొంటున్నారు.
నోటీసులు తీసుకున్న తర్వాత ఆక్రమణదారులు కోర్టుకు పోవడం స్టేలు తీసుకోవడం సర్వ సాధారణంగా మారాయి. అధికారులు సైతం కోర్టు పరిధిలో ఉందని చేతులు దులుపుకొంటున్నారు. ఇప్పటికే అధికారులకు బురాన్ ఖాన్ చెరువు, సుద్దమోని కుంట, చందన చెరువు, బీర చెరువు, మర్రి వాణి చెరువు తదితర చెరువులు కబ్జా అవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. తప్పును ఒకరిపై ఒకరు నెట్టుకోవడం తప్ప.. చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.
హైడ్రాకు ఫిర్యాదు చేసినా..
బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని 273 సర్వే నంబర్లో ఉన్న కొంత మోని కుంట కబ్జా అవుతున్నదని స్థానికుడు బొర్ర రవి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అధికారులు వచ్చి కొంత మోని కుంటను పరిశీలించి పోయారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు పేర్కొంటున్నారు. హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేదంటున్నారు.
స్థానిక కాంగ్రెస్ నేతల బెదిరింపులు
కొంత మోని కుంటను అనుసరించి వెంచర్లు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులకు సమాచారం రావడంతో అధికారులు పనులను నిలిపివేసినట్లు తెలిసింది. పనులు ఆపకూడదని అధికార పార్టీ నేతలు ఇరిగేషన్ అధికారులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో అధికారులు వెనుకడుగు వేయడంతో యథేచ్ఛగా వెంచర్లు వెలుస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులతో ఉద్యోగాలు చేయలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను వివరణ అడగ్గా.. కబ్జాలు నిజమేనని ధ్రువీకరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

