సర్వే చేయకుండానే కూల్చేసి తీరుమారని హైడ్రా
పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
- పార్క్‌స్థలాన్ని ఆక్రమించారని స్థానికుల ఫిర్యాదు
- స్థానికులకు, అధికారులకు మధ్య వాగ్వాదం
- జేసీబీకి అడ్డంగా పడ్డుకుని మహిళల నిరసన
- రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ఉద్రిక్త త
సిటీబ్యూరో/ బండ్లగూడ, జూలై 8 (నమస్తే తెలంగాణ): పార్క్ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందానగర్ లో మంగళవారం కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
స్థానికంగా ఉన్న వ్యక్తులు తమ దగ్గరున్న ఆధారాలు చూపిస్తూ సర్వే చేయకుండా ఎలా కూల్చేస్తారంటూ జేసీబీలకు అడ్డుపడడంతో పోలీసులు వారిని అక్కడినుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో జేసీబీలకు అడ్డంగా పడుకుని తమ చంపి ఆ తర్వాత స్థలంలోకి అడుగుపెట్టాలంటూ మహిళలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో భారీగా పోలీసులను మోహరించి కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న వారిని పోలీసుల సహకారంతో బలవంతంగా అక్కడినుంచి పక్కకు తప్పించి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రహారీని, షెడ్డును కూల్చేశారు.
నోటీసులు ఇవ్వకుండానే..
హైదర్‌గూడలోని గ్రామం సర్వే నెంబర్ 16లోని 1000 గజాల జాగలో ఉన్న పార్క్ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్రహరీని నిర్మించారని నలందానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం భారీ బందోబస్తుతో జేసీబీలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఖాళీగా ఉన్న స్థలం వద్దకు వచ్చి ఇది పార్కు స్థలం అంటూ జేసీబీతో అక్కడ ఉన్న మట్టి దిబ్బలను తొలగించేందుకు హైడ్రా అధికారులు ప్రయత్నించారు. జేసీబీలను అడ్డుకుంటూ కొందరు మహిళలు నేరుగా వాహనాల ముందు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రభుత్వం జారీ చేసిన పట్టాలు ఉన్నాయని, ఆ భూముల్లో తామే అసలైన యజమానులమంటూ బాధితులు వాదించారు.
హైదర్ గూడ సర్వేనెంబర్ 16 లో తమ భూమి ఉందని ఆ భూమి స్థలం తక్కువ వస్తుండడంతో తాము సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు వారు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలు కూల్చివేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం సర్వే నెంబర్ 16లో ఉన్న భూమి పార్క్‌కు కేటాయించారని, అందులో ప్రహరీ నిర్మాణం అక్రమమని తెలిపారు. హుడా లేఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంలో కబ్జా జరిగిందని, పూర్తివిచారణ జరిపిన అనంతరమే తాము కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

