Gandipeta | గండిపేటకు తప్పిన మురుగు ముప్పు.. నమస్తే తెలంగాణ కథనానికి స్పందించిన హైడ్రా
Gandipeta | జంటనగరాలకు తాగునీరు అందించే గండిపేట(ఉస్మాన్‌సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వరా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ.2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది.
- బుల్కాపూర్ నాలాకు గేట్లు అమర్చిన సిబ్బంది
Gandipeta | మణికొండ, మే 15: జంటనగరాలకు తాగునీరు అందించే గండిపేట(ఉస్మాన్‌సాగర్)కు మురుగు ముప్పు తప్పింది. ఖానాపూర్, వట్టి నాగులపల్లి నుంచి వచ్చిన మురుగు నీరు బుల్కాపూర్ నాలా ద్వరా గండిపేటలోకి వెళ్లకుండా హైడ్రా చర్యలు తీసుకుంది. రూ.2 లక్షలు వెచ్చించి బుల్కాపూర్ నాలాకు కొత్త షట్టర్లను ఏర్పాటు చేసింది.
వరద వచ్చేటప్పడు గండిపేటకు చేరేలా కాలువకు ఉన్న షట్టర్లు (గేట్లు) శిథిలమైన విషయం విదితమే. మురుగు నీరు గండిపేటలో కలుస్తున్నదని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై హైడ్రా స్పందించింది. అధికారుల బృందంతో కలసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంటనే షట్టర్ల మరమ్మతులను చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
షట్టర్లు అమర్చిన సిబ్బంది..
శిథిలమైన షట్టర్ల స్థానంలో కొత్తవి అమర్చడంతో మురుగు నీరు గండిపేట చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే బుల్కాపూర్ నాలాలో పూడికపోయిన చెత్తను కూడా కొంతమేర తొలగించి మురుగు ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు. ఒకప్పడు వరద కాలువగా ఉన్న బుల్కాపూర్ నాలాలో పైన ఉన్న నివాసాలు, వాణిజ్య సముదాయాలు, రిసార్టుల నుంచి మురుగు నీరు ప్రవహిస్తోంది.
శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూర్, కోకాపేట, నార్సింగ్, పుప్పాలగూడ, మణికొండ, దర్గా, షేక్‌పేట్, టోలిచౌకి , పోచమ్మ బస్తీ, చింతలబస్తీ మీదుగా హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీరును తీసుకెళ్లే చరిత్ర ఈ నాలాది. బుల్కాపూర్ నాలాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తే చాలా ప్రయోజనాలుంటాయని.. హుస్సేన్ సాగర్‌కు వర్షపు నీటిని తీసుకువచ్చే ఏకైక నాలాగా దీనికి ప్రత్యేక స్థానం ఉందని స్థానికులు తెలిపారు. ఇప్పుడీ నాలా పునరుద్ధరణపై హైడ్రా దృష్టి పెట్టింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

