కుప్పకూలిన సినిమాహాల్ పైకప్పు

- తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఘటన
- మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపులోకి మంటలు
- కుప్పకూలిన సినిమాహాల్ పైకప్పు
- ప్రొజెక్టర్, సీట్లు, స్క్రీన్లు అగ్నికి ఆహుతి
- సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం
కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 3 : కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్ అగ్నికి ఆహుతైంది. రాత్రి సెకండ్ షో ముగిసిన తర్వాత జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో.. తెల్లారేసరికి సినిమా థియేటర్ కుప్ప కూలింది. థియేటర్లో మంటలు అంటుకున్నాయని వచ్చిన సమాచారంతో పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మూడు ఫైర్ ఇంజిన్లు, రెండు వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను తెల్లారేసరికి అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాటు థియేటర్లో ఆనవాళ్లన్నీ బూడిదయ్యాయి. కేపీహెచ్‌బీ కాలనీ సీఐ బి.కిషన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
డయల్ 100కు సమాచారం.!
కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్లో ఆదివారం రాత్రి సెకండ్ షో ముగిసిన తర్వాత థియేటర్ సిబ్బంది, లైట్లు, ఫ్యాన్లు ఆపేసి, తలుపులు మూసేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ పక్కనే ఉన్న ఓ గదిలో వాచ్‌మన్ నిద్రపోయాడు. సోమవారం తెల్లవారు జామున 4:35గంటల సమయంలో థియేటర్ లోపల మంటలు అంటుకున్నట్లు డయల్ 100కు సమాచారం వచ్చింది. వెంటనే ఫైర్ ఇంజిన్ల సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని తెల్లవారు జామున 6 గంటల వరకు మంటలను అదుపులోకి తెచ్చాం. అప్పటికే థియేటర్లోని ప్రొజెక్టర్, స్క్రీన్, సౌండ్ సిస్టమ్, సీట్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు పైనున్న సీలింగ్ కూలిపోయింది. రాత్రివేళ అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణనష్టమేమీ సంభవించలేదు. సుమారు రూ.2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ యజమాని శ్రీనివాస్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే థియేటర్లో మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమిక అంచనాకొచ్చినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని పేర్కొన్నారు. మంటలార్పిన వారిలో డీఎఫ్‌వో సుధాకర్‌రావు, ఏడీఎఫ్‌వో సైదులు, కూకట్పల్లి ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

