చలానాపై యాప్‌లో దూషణలు.. కేసు నమోదు
తన బైక్‌కు ఎలా చలానా వేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్వహిస్తున్న యాప్‌లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..రామంతాపూర్, సత్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర నర్సింహులు పేరుతో ఉన్న పల్సర్ బైక్‌కు ఇటీవల రాంగ్ పార్కింగ్ పేరుతో ట్రా ఫిక్ చలానా పడింది.
బంజారాహిల్స్,మార్చి 14: తన బైక్‌కు ఎలా చలానా వేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు విభాగం నిర్వహిస్తున్న యాప్‌లో అత్యంత తీవ్రమైన పదజాలంతో దూషించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..రామంతాపూర్, సత్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎర్ర నర్సింహులు పేరుతో ఉన్న పల్సర్ బైక్‌కు ఇటీవల రాంగ్ పార్కింగ్ పేరుతో ట్రా ఫిక్ చలానా పడింది. దీంతో రాంగ్ చలానా వేశారంటూ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ‘రిపోర్ట్ అస్’ యాప్‌లో నర్సింహులు ఫిర్యా దు చేశాడు.
ఫిర్యాదులో భాగంగా అత్యంత అసభ్యకరమైన భాషలో బూతులు తిట్టడంతోపాటు, తాను రాంగ్ పార్కింగ్ చేయలేదని మెసేజ్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఫిర్యాదును పరిశీలించిన ట్రాఫిక్ హోంగార్డు మెహతాబ్ అహ్మద్ చలానా సరైనదే అని తేల్చారు. రాంగ్ పార్కింగ్‌లో బైక్ పార్క్ చేయడమే కాకుండా రిపోర్ట్ ఆస్ యాప్‌ను ఉపయోగించుకుని తప్పుడు ఫిర్యాదు చేయడం, బూతులతో మెసేజీలు పెట్టడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న నర్సింహులు మీద చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్లోని ట్రాఫిక్ ఈ చలానా విభాగం ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

