హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్ : ఆదివారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నిర్వహిస్తున్న ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ డేటా ప్రకారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా కాప్రా ఏరియాలో 68 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాలలో వరుసగా 20.8 మిమీ, 21.8 మిమీ వర్షపాతం నమోదైంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 0.1 మిమీ నుండి 15.5 మిమీ వరకు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, బేగంపేట, ముషీరాబాద్, అంబర్‌పేట, కార్వాన్, మలక్‌పేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, హైయత్నగర్ జోన్లలో తేలికపాటి వర్షం కురిసింది. ఉప్పల్, జూబ్లీహిల్స్, గోషామహల్, చార్మినార్, ఫలక్‌నుమాలో అతి తేలికపాటి వర్షపాతం నమోదైంది. జూన్ 30వ తేదీ వరకు ఇదే విధమైన వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

