వన్‌మంత్ ఇన్సూరెన్స్ చెల్లదు!
వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండాల్సిందే. ఆర్టీఏ అధికారులు వాహనదారుల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఇన్సూరెన్స్ లేని వాహనాలపై నిఘా ఉంచారు. కాగా, నగరంలో సుమారు 47 శాతం వాహనాలకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ వాహనం బీమా చేయించుకునేలా ఆర్టీఏ అధికారులు ‘నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్'పై కసరత్తు చేస్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండాల్సిందే. ఆర్టీఏ అధికారులు వాహనదారుల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఇన్సూరెన్స్ లేని వాహనాలపై నిఘా ఉంచారు. కాగా, నగరంలో సుమారు 47 శాతం వాహనాలకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ వాహనం బీమా చేయించుకునేలా ఆర్టీఏ అధికారులు ‘నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్’పై కసరత్తు చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇకపై నకిలీ బీమా పత్రాలతో ఆర్టీఏ సేవలు పొందడం కష్టమే. ఇన్సూరెన్స్‌ల కంపెనీలతో ఆర్టీఏ సమన్వయం చేసుకొని సదరు డాక్యుమెంట్స్ పరిశీలన చేస్తున్నారు. చాలా మంది ఆటో డ్రైవర్లు నెల గడువుతో ఇన్సూరెన్స్ చేయించి ఫిట్నెస్, యాజమాన్య బదిలీ తదితర ఆర్టీఏ సేవలు పొందేవారు. అయితే ఏడాది గడువు ఉన్న ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేయాలని ఆర్టీఏ యోచిస్తుంది. వన్ మంత్ ఇన్సూరెన్స్ ఆర్టీఏ అధికారులు అంగీకరించడం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. మరోవైపు వాహన యజమాని, ప్రయాణికుల భద్రతలో భాగంగానే ఇన్సూరెన్స్‌లో కఠినంగా ఉండాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది కొత్తగా వాహనం కొనుగోలు చేసే సమయంలో మినహా.. ఆ తర్వాత బీమా రెన్యూవల్‌కు ఆసక్తి చూపడం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

