పనిచేయని మొబైల్ టాయిలెట్లకూ బిల్లులు
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా..ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్, స్వచ్ఛ హైదరాబాద్ లాంటి ర్యాంకులతో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
- నిర్వహణలో లేకున్నా.. పనిచేస్తున్నట్లు రికార్డుల సృష్టి
- బహిరంగ మలవిసర్జన రహిత నగరానికి మంగళం
సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా..ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, వాటర్ ప్లస్, స్వచ్ఛ హైదరాబాద్ లాంటి ర్యాంకులతో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది.
కానీ గడిచిన రెండున్నరేండ్లుగా టాయిలెట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. కనిపించని పబ్లిక్ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్ఎంసీకే చెల్లింది. ముఖ్యంగా మొబైల్ టాయిలెట్లలోనూ అక్రమాలకు తెరలేపారు. జోన్‌కు ఒకటి చొప్పున మొబైల్ టాయిలెట్లను సమకూర్చగా..ప్రధాన కార్యాలయం పరిధిలో మరో ఆరింటిని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాలైన హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు.
ఐతే గడిచిన కొద్ది రోజులుగా మొబైల్ టాయిలెట్స్ నిర్వహణలో లేకున్నా..నెలకు రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేస్తుండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. కాగా నిర్వహణలో భాగంగా ప్రతి అరకర కిలోమీటర్ రద్దీ రోడ్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు ప్రస్తుతం ఆరు జోన్లలో 4826 సీట్లలో 1857 పబ్లిక్ టాయిలెట్లను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 1385 చోట్ల మాత్రమే టాయిలెట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు కమిషనర్‌కు నివేదిక ఇటీవల అందజేశారు. అంటే 472 చోట్ల టాయిలెట్లు వినియోగంలోకి లేవని, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ నివేదికలో పేర్కొన్నారు.
‘అర్జెంట్’ అయితే కష్టమే
టాయిలెట్ల క్షేత్రస్థాయిలో లేకున్నా వాటి పేరుతో నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నట్లు, ఇందులో కొన్ని ఏజెన్సీలతో అధికారులు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లలో సగానికి పైగా వినియోగంలో లేవని, కొన్ని చోట్ల గాయబ్ అయ్యాయని, బిల్లులు చెల్లింపులు మాత్రం యథావిధిగా జరుపుతుండడం పట్ల ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల నల్లాలు, డోర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవడంతో నిరుపయోగం మారాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చే వారికి ‘ఆర్జెంట్ ’ అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి నెలకొనడం విచారకరం.
నీళ్లు ఉంటలే..క్లీన్ చేస్తలే
ఆర్టీసీ బస్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు , పార్కుల వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్లలో చాలా వరకు ప్రస్తుతం కనిపించడం లేదు. వాస్తవానికి కమర్షియల్ ఏరియాల్లో ఉండే టాయిలెట్లను రోజుకు నాలుగు సార్లు, నాన్ కమర్షియల్ రోజుకు కనీసం మూడు సార్లు టాయిలెట్లను క్లీన్ చేయాల్సి ఉంది. డైలీ క్లీనింగ్ చేస్తున్నారా? అంటే లేదనే స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని టాయిలెట్లకు కనీసం డోర్లు కూడా ఉండడం లేదని చెబుతున్నారు. వీటికి తోడు టాయిలెట్లలో వాటర్ కూడా అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. ‘పే అండ్ యూజ్’ , బస్టాప్‌ల వద్ద ఉండే సులభ్ కాంప్లెక్స్‌లను ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

