పుడ్డింగ్‌తో లింక్ ఉందా..?
డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) ఇటీవల
లక్ష్మీపతి నెట్ వర్క్‌పై.. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఫోకస్
పుడ్డింగ్‌కు ప్రేమ్ఉపాధ్యాయ్ గ్యాంగ్‌కు లింక్‌పై ఆరా
సెల్‌ఫోన్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు
148 మందిలో.. 10 మంది విదేశీయులు
వారి కదలికలపై పోలీసులు నిఘా
వైజాగ్‌లో ప్రధాన డ్రగ్ విక్రేతలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 4 : డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) ఇటీవల ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే సరఫరా దారుడిని అరెస్ట్ చేయగా.. అతడి నెట్‌వర్క్‌కు సంబంధించిన డ్రగ్ విక్రేతలు, వినియోగదారుల కోసం తీవ్రంగా గాలిస్తున్నది.
వైజాగ్‌లో ప్రధాన డ్రగ్ విక్రేతలు
ప్రేమ్ ఉపాధ్యాయ్ స్నేహితుడితో గోవా, ఇతర ప్రాంతాల్లో కలిసి తిరిగిన అశోక్‌నగర్‌కు చెందిన యువకుడు డ్రగ్స్‌కు బానిసై ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రేమ్ ఉపాధ్యాయ్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన లక్ష్మీపతి నెట్ వర్క్‌ను కూడా ఛేదిస్తున్నారు. ఈ క్రమంలో మరికొంత మంది డ్రగ్స్ విక్రేతలకు సంబంధించిన సమాచారం హెచ్న్యూకు లభించింది. వైజాగ్‌లో ప్రధాన డ్రగ్ విక్రేతలు ఉన్నట్లు పోలీసులకు కొంత సమాచారం అందింది. దీంతో ప్రధాన సూత్రధారులపై ఇప్పుడు హెచ్‌న్యూ ఫోకస్ పెట్టింది. అయితే లక్ష్మీపతికి డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన నెట్ వర్క్ అంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రత్యేక బృందాల గాలింపుతో బయటపడింది.
పుడ్డింగ్ పబ్ నెట్ వర్క్‌తో..
ఓ పక్క ప్రేమ్, లక్ష్మీపతి నెట్‌వర్క్‌ను ఛేదిస్తున్న హెచ్‌న్యూ తాజాగా వెలుగులోకి వచ్చిన బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో లభ్యమైన డ్రగ్స్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ప్రేమ్ నెట్ వర్క్, పుడ్డింగ్‌లో లభించిన కొకైన్కు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందుకు ప్రేమ్ నెట్‌వర్క్‌లో ఇప్పటి వరకు పోలీసులకు అందిన సమాచారాన్ని, తాజాగా పబ్‌లో లభించిన సమాచారాన్ని సరిపోల్చుకుంటున్నారు. ఈ కేసులో అరస్టైన ఇద్దరు నిందితులతో పాటు పారారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు, పబ్బులో పార్టీ కోసం వచ్చిన 148 మంది సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. దీంతో పాటు గతంలో అరస్టైన డ్రగ్ పెడ్లర్స్‌కు లింకులున్నాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. కాగా ర్యాడిసన్ హోటల్లోని పబ్‌లో డ్రగ్స్ సేవించిన వారెవరు అనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు ఈ సెల్‌ఫోన్ డాటా కాల్స్‌ను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. 148 మందిలో 10 మంది వరకు విదేశీ యువతి, యువకులు కూడా ఉండటంతో వారి కదలికలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.
డ్రగ్స్ సరఫరాదారులు లక్ష్మీపతి, ప్రేమ్ నెట్‌వర్క్‌తో పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌కు లింకు ఉందా..? అందులో లభించిన
కొకైన్కు వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? పట్టుబడిన 148 మందిలో 10 మంది విదేశీయులు ఉండగా.. వీరి పాత్ర ఏమైనా ఉన్నదా..? వీరి ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతుందా.? ఈ విషయాలపై నగర పోలీసులు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ కాల్ డేటాను ఆరా తీస్తేనే అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రధాన డ్రగ్స్ సరఫరా దారుల గుట్టు రట్టు కానున్నది. వైజాగ్‌లో ఉన్న ప్రధాన డ్రగ్స్ విక్రయదారులు ఎవరనేది తేలిపోతున్నది. అయితే పోలీసులు ఫోన్‌కాల్ డేటాను ఆరా తీస్తున్నారని తెలుసుకున్న డ్రగ్స్ విక్రయదారుల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

