Hyderabad | పెళ్లిరోజు మద్యం తాగవద్దంటే.. పురుగుల మందు తాగాడు.. హైదరాబాద్లో దారుణం
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : పెళ్లిరోజున మద్యం తాగవద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : పెళ్లిరోజున మద్యం తాగవద్దని భార్య మందలించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.51లోని జర్నలిస్టు కాలనీకి చెందిన కె.రాము(44) కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు. గత నెల 31వ తేదీన పెళ్లిరోజు కావడంతో భార్యతో కలిసి ఉదయాన్నే గుడికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి త్వరగా వస్తే బయటకు వెళ్దామంటూ భార్య చెప్పడంతో ఆమెతో గొడవకు దిగాడు. ఆ రోజు సాయంత్రం మద్యం సేవించాలని, డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. పెళ్లి రోజు కూడా మందు తాగడమేంటని ఆమె గట్టిగా నిలదీసింది. దీంతో ఆవేశంలో బయటకు వెళ్లి పురుగుల మందు తాగొచ్చాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన రాము.. పురుగుల మందు తాగానని చెప్పాడు. ఇంతలోనే ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో భయాందోళనకు గురైన రాము భార్య.. అతన్ని మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

