శ్రీకాంతాచారిని తెలంగాణ మరువదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
- మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి
- నివాళులర్పించిన ప్రముఖులు
మన్సూరాబాద్/చంపాపేట/వనస్థలిపురం, డిసెంబర్ 3 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఎల్బీనగర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కార్యక్రమానికి హాజరై కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం అమరులైన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని చేయూతనిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాచారి, సల్వాచారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడు కాసోజు శ్రీకాంతాచారి పోరాటాన్ని మరువలేమని టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సతీశ్‌యాదవ్, జగన్మోహన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాఘవచారి, సాయి తదితరులు పాల్గొన్నారు.
మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై నివాళులర్పించారు.
కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహ గౌడ్, నాయకులు పండాల రాజశేఖర్ గౌడ్, మేడిగ శ్రీధర్, ఎమ్ఎస్. కుమార్, ఎస్కే మహ్మద్, పోచబోయిన జగదీశ్‌యాదవ్, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోజు కృష్ణమాచారి, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం నాయకులు పాల్గొన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్‌చారి వర్ధంతిని నిర్వహించారు. ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, సీనియర్ నాయకుడు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

