సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వాహనం కొనడానికి ఫీచర్లు, రక్షణ, సౌకర్యవంతం.. ఎంత ముఖ్యమో కొన్న తరువాత వాహనదారులు వాహన నంబర్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. వాహనాల నంబర్‌ను సెంటిమెంట్‌గా, హోదాకు గుర్తుగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చుకు వెనుకాడటం లేదు. కొందరు పుట్టినతేదీలు, వివాహతేదీలు కలిసి వచ్చేట్లుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను తీసుకుంటుండగా.. మరికొందరూ తమ అదృష్ట సంఖ్య వచ్చేలా తీసుకుంటున్నారు. ఇంకొందరూ తమ వాహనాలన్నీ ఒకే నెంబర్‌తో ఉండాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలంలో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనేందుకు వాహనదారులు సిద్ధమవుతుండడంతో రవాణా శాఖకు కాసుల పంట పండుతోంది.
వాహనదారులు తమకు నచ్చిన నెంబర్లను కైవసంచేసుకోవడానికి పోటాపోటీగా నిలుస్తున్నారు. ఆర్టీఏ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన నంబర్ 9999.ఈ నంబర్‌కు ఓ బిజినెస్ సంస్థ ఏకంగా
20 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత స్థానంలో 0999 నంబర్ రూ.14లక్షలు పలికి సత్తా చాటింది. ఇలా 0001, 0009 నెంబర్లకు భలే డిమాండ్ ఉంది. ఈ హాట్‌కేక్ నంబర్లు సంబంధిత సిరీస్ మారాక రిపీట్ అవుతుంటాయి.
క్రేజీ నంబర్లు ఇవే..
రవాణా శాఖలో ప్రత్యేకమైన ఆకర్శణీయ నంబర్లు 0001, 0009, 0999, 9999, 0099, 0333, 0555, 0666, 0777, 0888, 2222, 3333,4444, 5555, 6666, 7777,8888, 0123, 0222, 0369, 0444, 0567, 0786, 1111, 1116, 3366, 3456, 4455, 0003, 0005, 0006, 0007,0111, 0234, 0306, 0405,0789, 0818,0909, 1188, 1314, 1818, 1899, 2277, 2772, 2345, 2727, 2799, 3636, 3663, 3699, 4545,4554, 4567, 4599, 5678, 6336, 6633,6789, 7227, 7722, 8118, 8811, 9009, 9099 లను అధికారులు ప్రత్యేకంగా పొందుపరిచారు. ఈ నెంబర్లను కైవసం చేసుకోవాలంటే నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
సొంతం చేసుకోవడం ఇలా..
మొదటి నాలుగు నంబర్లకు రూ.50 వేలు ఫీజు, ఆ తర్వాత నంబర్లకు కేటగిరిల వారీగా రూ.30వేలు, 20 వేలు, 10వేలు… ఇలా ఫీజులు నిర్ణయించారు. ఈ మేరకు ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకునే వారు సదరు ఫీజులు చెల్లించి ఆన్లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ వేలంలో పాల్గొనాలి. పోటీదారుడు అదే నంబర్‌పై బిడ్డింగ్‌లో ఉంటే ఎవరు అధికంగా డబ్బులు వెచ్చిస్తారో, వారికే నంబర్ జారీ అవుతుంది. అయితే నంబర్ రాని వ్యక్తి ఖాతాలో చెల్లించిన ఫీజు 3 రోజుల్లో జమ అవుతుంది.
పూర్తి నంబర్ ఉండాల్సిందే..
ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకున్న వారు ఆర్టీఏ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్‌ను వాహనానికి అమర్చాలి. చాలా మంది 0001 నంబర్ దక్కించుకున్న వారు కేవలం నెంబర్ ప్లేట్‌పై 1, 9, 3 ఇలా ఒంటిరి నెంబర్లను అమర్చుతున్నారు. ఇది మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం నేరమని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సదరు వాహనాలు రోడ్లమీదకు వస్తే జరిమానాతో పాటు సీజ్ కూడా చేస్తామని రంగారెడ్డి డీటీవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఇటీవల ఓ సినీరంగానికి చెందిన వ్యక్తి తన వాహనంపై 69 నెంబర్‌ను అమర్చుకుని అధికారులకు దొరికిపోయి జరిమానా చెల్లించాడు.
ఒక్క రోజే 47.52 లక్షల ఆదాయం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో మంగళవారం ఒక్క రోజే 47.52 లక్షల ఆదాయం ఆర్టీఏ ఖజానాలో జమ అయిందని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండు
రంగ నాయక్ తెలిపారు. టీఎస్09ఎఫ్వై9999 నెంబర్‌ను ఆదిత్య బ్రాడ్ కాస్టింగ్ సంస్థ రూ.15 లక్షలకు దక్కించుకున్నారు.
టీఎస్09ఎఫ్‌జెడ్ 0099
సుశీ ఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్ రూ.6.31లక్షలకు దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌జెడ్
0001 సౌమ్య చలసాని రూ.5.50లక్షలకు దక్కించుకున్నారు. టీఎస్09ఎఫ్‌జెడ్ 0007 దీక్షిత్
స్వాతి రూ.2.45లక్షలకు దక్కించుకుంది.