Hyderabad | హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లో పోకిరీలు రెచ్చిపోయారు. పోలీసుల ముందే ప్రమాదకరమైన సంట్లు చేశారు. బైక్ ముందు వీల్‌ను పైకి లేపి రయ్ రయ్.. దూసుకెళ్లిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు కూడా చేశారు. దానికి పోలీసుల ముందే మా స్టంట్స్ అంటూ థంబ్‌నెయిల్ కూడా పెట్టారు.
ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. స్టంట్స్‌కు పాల్పడిన పోకిరీల ఆటకట్టించారు. వారిని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.