హైదరాబాద్‌లో ‘రియల్’ జోరు తగ్గలేదు. మహానగరంలో రికార్డు స్థాయిలో గృహాలు అమ్ముడవుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన వృద్ధి రేటుతో రూ.4,984 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగినట్లు.. 2021తో పోలిస్తే 2022లో 28 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన 2022 వార్షిక నివేదికలో తేల్చి చెప్పింది. దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోవాణిజ్య మార్కెట్ 12 శాతం వృద్ధి కనబర్చగా..
ఆఫీస్ లీజ్‌లో 67 లక్షల చదరపు
అడుగుల స్పేస్‌తో టాప్ 3లో నిలిచినట్లు వివరించింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి,రాయదుర్గం ప్రాంతాల్లో గృహాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధించినట్ల్లు తెలిపింది. కొత్త లాంచ్‌లు కూడా 23 శాతం పెరిగినట్లు.. రెసిడెన్షియల్ మార్కెట్లోనూ 32 శాతం వృద్ధి కనబరిచినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ సీనియర్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు.
సిటీబ్యూరో, జనవరి 10(నమస్తే తెలంగాణ): వడ్డీరేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. 2022 సంవత్సరంలో గణనీయమైన వృద్ధి రేటుతో రూ.4,984కోట్ల విలువైన గృహ అమ్మకాలు జరిగాయి. గత యేడాదిలో నమోదైన రికార్డును అధిగమించి 28శాతం అమ్మకాలు పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజ్లోనూ 2022లో 6.7 మిలియన్ చదరపు అడుగుల వార్షిక కార్యాలయ లావాదేవీలను నమోదు చేసింది. ఇందుకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ 2022 వార్షిక నివేదికను వెల్లడించింది. 2011 సంవత్సరంతో పోలిస్తే గత పదేండ్లలో గృహ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల మార్కెట్లతో పోలిస్తే హైదరాబాద్‌లో వాణిజ్య మార్కెట్ 12 శాతం వృద్ధిని కనబర్చగా.. ఆఫీస్ లీజింగ్‌లో 6.7 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ లీజ్తో హైదరాబాద్ టాప్ 3గా నిలిచింది.
పశ్చిమ హైదరాబాద్‌లో హవా
అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలోనే ఇండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు ఏమాత్రం డిమాండ్ తగ్గడంలేదు. గచ్చిబౌలీ, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో గృహ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతూ వస్తున్నది. కొత్త లాంచ్‌లు కూడా ఏడాదికాలంలో 23శాతం పెరుగుదలను చూపాయి. గత పదేండ్లతో పోలిస్తే 2022లో 43,847 యూనిట్లు అదనం. 2022లో హైదరాబాద్‌లో సగటు లావాదేవీల అద్దెలు సైతం 6శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్‌లో 56శాతం పెరుగుదల కనిపించగా.. ఆఫీస్ స్పేస్ మొత్తం లావాదేవీలలో హైదరాబాద్ ఆఫీస్ వాటా 69శాతంగా ఉంది.
రెసిడెన్షియల్ మార్కెట్లో 32శాతం వృద్ధి
పెరిగిన వడ్డీ రేట్లు గృహ కొనుగోళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. 2022 రెండో అర్థ సంవత్సరంలో హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 16,353 యూనిట్ల విక్రయాలతో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. తెల్లాపూర్, కొల్లూరు, గండిపేట వంటి ప్రాంతాల్లో ఈ వృద్ధి ఎక్కువగా ఉంది. రుణాల వడ్డీ రేట్లు పెరిగినా గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని, హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లలో కనబడుతున్న పెరుగుదలే ఇందుకు నిదర్శనమని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ సీనియర్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు.