Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్ .. ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ
Gandhi Hospital | సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్‌ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
Gandhi Hospital | సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్‌ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేట్లబూర్జు, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. వీటి ద్వారా ఖరీదైన ట్రీట్మెంట్ను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. కాగా, రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చెప్పారు. ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఐవీఎఫ్ విధానాన్ని అందుబాటులోకి తేవడం శుభపరిణామమని సంతాన సాఫల్య కేంద్రం నోడల్ అధికారి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ వెల్లంకి జానకీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

