ఉచిత నీటి పథకం..9.7 లక్షల మందికి లబ్ధి

- సీఎస్ఎంపీ కింద 62 ఎస్టీపీలు
- నగరవాసుల కోసం జలమండలి అత్యాధునిక సేవలు
నగర ప్రజలకు తాగునీరు అందించేందుకు జలమండలి అనేక చర్యలు చేపడుతున్నది. అత్యాధునిక టెక్నాలజీతో హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల సేవలను అందిస్తున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేల కోట్లతో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం కింద 9.7 లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నది. ఎండాకాలంలో తాగునీటి సరఫరా కోసం కృష్ణా నుంచి ముడి జలాలను సేకరించే సమస్యను అధిగమించేందుకు రూ.1450 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతేకాక నగరంలోని ముఖ్య ప్రాంతాల్లోని సర్కిళ్లు, ఓఆర్ఆర్ చుట్టు పక్కల గ్రామాలను కవర్ చేస్తూ 62 మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మిస్తున్నది.
- హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఇప్పటికే నీటి సరఫరా, మురుగునీటి నెట్వర్క్ ప్రాజెక్టులను చేపట్టింది. 2020-21లో పలు ఎస్టీపీలను ఏర్పాటు చేసింది. ఉచిత నీటి సరఫరా పథకంతో పాటు మంచినీటి పైపులైన్లు వేశారు.
- ఉచిత నీటి సరఫరా పథకంతో ఇప్పటికే 9.7 లక్షల మందికి లబ్ధి జరుగుతుండగా.. ఈ పథకం కింద 4.1 లక్షల వినియోగదారులుఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్నారు.
- 2000 చ.కి.మీ.లో విస్తరించిన హైదరాబాద్‌కు నీటి సరఫరా, మురుగునీటి పారుదల సేవలు అందించే బాధ్యతను చేపట్టిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ అన్ని నీటి వనరుల నుంచి మొత్తం 522.87 ఎంజీడీలను వెలికి తీస్తున్నది. మురుగు నీటి పారుదల నెట్వర్క్ నిర్వహణలో భాగంగా 772 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేస్తున్నది.
- రూ.285 కోట్ల వ్యయంతో 18 కిలో మీటర్ల పొడవునా మూడు వేల మి.మీ. డయా రింగ్ మెయిన్‌ను ప్రారంభించింది. ఈ పైప్‌లైన్‌తో కొల్లూరు 2 బీహెచ్‌కే హౌసింగ్ కాలనీ, హెచ్ఎండీఏ కోకాపేట్ లే అవుట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సింగూరుకు ప్రయోజనం కలుగనున్నది. ఇప్పటికే 12.84 కి.మీ పనులు పూర్తయ్యాయి.
- నల్లగండ్ల, ఇందిరానగర్, హౌసింగ్ కాలనీలు, తెల్లాపూర్ మున్సిపాలిటీకి నీటి సరఫరా ఏర్పాటుతో పాటు 1000 ఎంఎం డయా పైపులైన్‌కు శ్రీకారం చుట్టింది. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఆర్అండ్బీ నిర్మిస్తున్న రేడియల్ రోడ్ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రయోజనం చేకూరనున్నది.
- కృష్ణా నుంచి ముడి జలాలను వెలికితీసే సమస్యను అధిగమించేందుకు రూ.1450 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భూగర్భ షాఫ్ట్ నిర్మాణం, ఇన్‌టెక్ సొరంగం, పంపు హౌస్ సూపర్ స్ట్రక్చర్, ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, కోదండాపూర్ వద్ద సుకింశాల నుంచి డబ్ల్యూ టీపీలకు పైప్‌లైన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- మాస్టర్ ప్లాన్‌లో భాగంగా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా ఓఆర్ఆర్ వరకు 62 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. మరోవైపు జీహెచ్ఎంసీలో 1257.50 ఎంఎల్టీ సామర్థ్యంతో 31 ఎస్టీపీలను చేపట్టాలని ప్రతిపాదించింది.
- మొత్తం 31 ఎస్టీపీలలో రూ.1280.87 కోట్లతో చేపట్టిన 376.5 ఎంఎల్డీ సామర్థ్యం గల పదిహేను ఎస్టీపీలకు పాలనాపరమైన అనుమతులు వచ్చాయని నివేదికలో వెల్లడించింది. దీంతో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు, హుసేన్సాగర్ చెరువు ప్రాంతాలు ప్రయోజనం పొందనున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- free water supply
- HMWSSB
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

