పంద్రాగస్టు వరకు ఉచితం గడువు

- నల్లాకనెక్షన్దారులకు వెసులుబాటు
- ఆగస్టు 15లోపు ఆధార్‌తో లింక్ చేసుకోవాలి
- నల్లా మీటర్, పీటీఐ నంబర్ తప్పనిసరి
- ఒక్కో ఇంటికి నెలకు 20 వేల లీటర్లు ఉచితం
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తేతెలంగాణ): నల్లా కనెక్షన్‌దారులకు ఊరట. ఉచిత తాగునీటి పథకం లబ్ధి పొందేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. గ్రేటర్‌వ్యాప్తంగా వివిధ కారణాల వల్ల అపార్ట్మెంట్లు, గృహ వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేసుకోలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అనుసంధానం గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉచిత తాగునీటి పథకం లబ్ధి పొందాలంటే నల్లాకు మీటర్ తప్పనిసరి. పంద్రాగస్టు వరకు తాగునీరు, సీవరేజి బిల్లులను జలమండలి నిలిపివేయనుంది. బస్తీల్లో నివాసముంటున్న వారు తమ కనెక్షన్‌కు మీటరు బిగించుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్ చేసుకోని వినియోగదారులకు ఆగస్టు 15 తర్వాత బిల్లులు జారీ చేస్తారు. వారు 2020 డిసెంబర్ నుంచి ఆగస్టు 31 వరకు అంటే 9 నెలల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీరికి ఎలాంటి వడ్డీ, జరిమానా విధించరు. నల్లా కనెక్షన్‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే మీ సేవ కేంద్రం లేదా జలమండలి వెబ్‌సైట్‌ను (www.hyderabadwater.gov.in) సంప్రదించొచ్చు. మరింత సమాచారం కోసం జలమండలి టోల్‌ఫ్రీ నంబర్ 155313ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

