Credit Card | కస్టమర్ వద్దన్నా క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంక్.. హెచ్‌డీఎఫ్‌సీకి భారీ జరిమానా
Credit Card | క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయకున్నా సరే ఓ కస్టమర్‌కి హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చింది. అంతేకాకుండా అతని అకౌంట్ నుంచి రూ.33,493ను కట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసింది. తనకు తెలియకుండా క్రెడిట్ కార్డు, ఆరోగ్య బీమా పాలసీలు ఎలా ఇస్తారని సదరు కస్టమర్ అడిగినా నిర్లక్ష్యంగా ఫిర్యాదు చేసింది.
Credit Card | సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయకున్నా సరే ఓ కస్టమర్‌కి హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చింది. అంతేకాకుండా అతని అకౌంట్ నుంచి రూ.33,493ను కట్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసింది. తనకు తెలియకుండా క్రెడిట్ కార్డు, ఆరోగ్య బీమా పాలసీలు ఎలా ఇస్తారని సదరు కస్టమర్ అడిగినా నిర్లక్ష్యంగా ఫిర్యాదు చేసింది. దీంతో అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో బ్యాంకుకు భారీ జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. కోఠీలోని బ్యాంక్ స్ట్రీట్‌కు చెందిన వెంకటయ్య ప్రైవేటు ఉద్యోగి. అప్పట్లో తన ఇంటికి హెచ్డీఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కోరారు. దీనికి వెంకటయ్య నిరాకరించాడు. దీంతో క్రెడిట్ కార్డు జిరాక్స్ తీసుకొని అతనికి తెలియకుండానే 2020 సెప్టెంబర్‌లో ఆరోగ్య పాలసీకి అప్లై చేశాడు. ఇందుకు గాను తన క్రెడిట్ ఖాతా నుంచి రూ.1560 విత్‌డ్రా అయ్యాయి. దీనిపై ఫిర్యాదు చేయడంతో వెంకటయ్య తనకున్న క్రెడిట్ కార్డును క్లోజ్ చేశారు. అయితే కొద్దిరోజుల్లోనే మరో హెచ్డీఎఫ్సీ నూతన క్రెడిట్ కార్డును ఖాతాదారుడి ఇంటికి పంపించింది సంస్థ. పంపించడమే కాకుండా ఆరోగ్యబీమా పాలసీ అంటూ రూ.33,493 విత్‌డ్రా చేసింది. ఖాతాదారుడు ఎటువంటి పాలసీ తీసుకోలేదు. సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1లో ఫిర్యాదు చేశారు. కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, ఆర్. నారాయణ రెడ్డిలతో కూడిన బెంచ్ కేసు వివరాలను పరిశీలించింది. వినియోగదారుడికి 9శాతం వడ్డీతో కలిపి రూ.33,493 చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే రూ.10వేల జరిమానాతోపాటు 10వేలు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ట్యాంక్‌బండ్‌లోని హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు డివిజన్‌తోపాటు హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థను ఆదేశించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

