Minister Talasani | మంత్రి తలసానిని కలిసిన హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్
Minister Talasani | ఇటీవల జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచిన దేవరాజ్(HCA Secretary Devaraj), కౌన్సిల్ మెంబర్ సునీల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హెచ్‌సీఏను ఉన్నతంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి పేరు తేసుకురావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ : ఇటీవల జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచిన దేవరాజ్(HCA Secretary Devaraj), కౌన్సిల్ మెంబర్ సునీల్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీరికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హెచ్‌సీఏను ఉన్నతంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి పేరు తేసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేసిన అమర్నాధ్, శేష్ నారాయణ, శివాలాల్ యాదవ్ లు కూడా మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
కాగా, ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్) విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానేల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), ట్రెజరర్‌గా సీజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ HCA ప్యానెల్), కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) విజయం సాధించారు. జగన్ మోహన్ రావు ఒక్క ఓటుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

