చకచకా రూపుదిద్దుకుంటున్న నియో పోలిస్
నగర శివారులో రియల్ రంగానికి సరికొత్త రూపాన్ని తీసుకువస్తున్నది హెచ్ఎండీఏ. సువిశాలమైన రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నది.
- 529.66ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు
- అన్నీ ఆకాశ హర్మ్యాలే..
- రద్దీకి తగ్గట్లుగా 150, 120 అడుగుల రోడ్లు
- లేఅవుట్ రెండు వైపులా 10 చోట్ల ప్రధాన రహదారులతో లింకు
- చివరి దశకు చేరుకున్న డ్రైనేజీ, విద్యుత్ పనులు
- 4 వరుసల్లో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లు
- ప్రతిపాదనలు సిద్ధం చేసిన హెచ్ఎండీఏ
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో రియల్ రంగానికి సరికొత్త రూపాన్ని తీసుకువస్తున్నది హెచ్ఎండీఏ. సువిశాలమైన రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో సుమారు 529.66ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా నియో పోలీస్ (ఎస్ఈజెడ్-స్పెషల్ ఎకనామిక్ జోన్) పేరుతో భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తుండగా, ప్రధాన రహదారులతో పాటు లింకు రోడ్ల నిర్మాణానికి అంతే ప్రాధాన్యతనిస్తున్నది. ప్రస్తుతం ఈ లేఅవుట్లో 150, 120 అడుగుల వెడల్పుతో విశాలైన బీటీ రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, మంచినీరు, డ్రైనేజీ లైన్లను అత్యాధునిక తరహాలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా వరద నీరు పారేందుకు బాక్స్ డ్రైన్లను నిర్మించారు.’
లింకు రోడ్ల నిర్మాణంపైనా…
తాజాగా కోకాపేట నియో పోలిస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ లింకు రోడ్ల నిర్మాణంపైనా హెచ్ఎండీఏ దృష్టి సారించింది. 500లకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న నియో పోలిస్ లేఅవుట్లో భారీ ఎత్తైన ఆకాశ హర్మ్యాలే నిర్మించనుండటంతో అక్కడి రద్దీని తట్టుకునేలా సువిశాలమైన లింకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన రోడ్ డెవలప్మెంట్ ప్రణాళికను రాష్ట్ర ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) రూపొందించింది. సుమారు రూ.300 కోట్లతో లేఅవుట్లో మౌలిక వసతులు కల్పిస్తున్న హెచ్ఎండీఏ, లింకు రోడ్ల విషయంలోనూ ఏ మాత్రం తగ్గకుండా 100 అడుగుల విస్తీర్ణంతో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు.
6 చోట్ల అవుటర్ రింగు రోడ్డుతో అనుసంధానం
ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని కోకాపేట నియో పోలిస్ లేఅవుట్ నుంచి వాహనాలు ప్రధాన రహదారులకు వెళ్లేందుకు వీలుగా లింకు రోడ్లను ప్రతిపాదించారు. ఈ లేఅవుట్‌కు ఒకవైపు అవుటర్ రింగు రోడ్డు, మరోవైపు మెహిదీపట్నం-శంకర్పల్లి ప్రధాన రహదారి (రేడియల్ రోడ్డు) ఉంది. ఈ రెండు ప్రధాన రోడ్లను కలుపుతూ ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును 6 చోట్ల కలుపుతుండగా, శంకర్పల్లి ప్రధాన రహదారిని 4 చోట్ల అనుసంధానం చేస్తూ లింకు రోడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు.
70శాతం పూర్తయిన ట్రంపెట్ పనులు
ముఖ్యంగా నియోపోలిస్ లేవుట్ నుంచి వాహనాలు నేరుగా అవుటర్ రింగు రోడ్డు ప్రధాన రహదారి పైకి వెళ్లేందుకు వీలుగా ట్రంపెట్ నిర్మాణం ఇప్పటికే చేపట్టారు. దీనికి సంబంధించిన పనులు 70శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా సర్వీసు రోడ్లతో 5 చోట్ల అనుసంధానం అవుతున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో అన్ని రోడ్ల మీదుగా ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు గణనీయంగా పెరగడం వల్ల ఎదురైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ లింకు రోడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లను 2 వరుసల నుంచి 4 వరుసలకు విస్తరిస్తుండటంతో నియో పోలీస్ నుంచి వచ్చే ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఉంటాయని హెచ్ఎండీఏ అధికారి తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

