మనసిచ్చిన వాడితోనే.. మూడుముళ్లు
అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్‌గూడ స్టేట్ హోం వేదికైంది. షాబాద్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన దివంగత అల్లవాడ నర్సింహులు
అధికారులే ఆప్తులై.. నిండు మనసుతో ఆశీర్వదించి..
స్టేట్ హోంలో అపురూప ఘట్టం
వేడుకగా సింధు-ఉపేందర్ కల్యాణం
దీవించిన ఎమ్మెల్యే మాగంటి , కలెక్టర్ శర్మన్
వెంగళరావునగర్, మే 25 : అధికారులే ఆప్తులయ్యారు.. నా అనే వాళ్లు లేని ఆ అనాథకు ఏ లోటు రాకుండా.. పెంచి పెద్ద చేశారు. తాను మనసు పడిన వాడితోనే ఘనంగా పెండ్లి జరిపించి.. అత్తారింటికి సాగనంపారు. ఈ ఆదర్శ వివాహానికి యూసుఫ్‌గూడ స్టేట్ హోం వేదికైంది. షాబాద్ మండలం, రుద్రారం గ్రామానికి చెందిన దివంగత అల్లవాడ నర్సింహులు, పద్మజ దంపతుల చిన్న కుమారుడు ఉపేందర్ (30) స్విగ్గీలో డెలివరీబాయ్‌గా పనిచేస్తూ.. మోతీనగర్‌లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో ఉండే సింధు (28) బేగంపేట్ షాపర్స్ స్టాప్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్నది.
ఆమెకు తల్లిదండ్రులు లేరు. నెల వయసున్నప్పుడు యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో అధికారులు ఆమెను చేర్పించారు. అనంతరం సింధు బాలసదనంలో ఉంటూ.. ఇంటర్ వరకు చదువుకున్నది. మేజర్ కావడంతో హోంను వీడి.. మోతీనగర్‌లో నివాసముండేది. అక్కడే ఉపేందర్, సింధుల మనసులు కలిశాయి. ప్రేమించానని.. అంగీకరిస్తే పెండ్లి చేసుకునేందుకు సిద్ధమన్నాడు ఉపేందర్.
వేడుకగా…
తనను పెంచి పెద్ద చేసిన యూసుఫ్‌గూడ స్టేట్‌హోంకు వెళ్లిన సింధు.. జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్రావును కలిసింది. ఉపేందర్‌ను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. తమకు వివాహం చేస్తారా.. అని అడిగింది . ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్‌కు చెప్పడంతో సింధు పెండ్లికి మార్గం సుగమమైంది. బుధవారం కమిషనరేట్ ఆవరణలోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోంలో సింధు, ఉపేందర్ వివాహం వేడుకగా జరిగింది. శిశు విహార్‌లో, బాలసదన్‌లో తనతో కలిసి ఉన్న స్నేహితురాలు సరోజ, ఆమె భర్త హరిప్రసాద్‌లు సింధును ఉపేందర్‌కు ఇచ్చి కన్యాదానం చేశారు. సింధుకు బాసికం కట్టారు. పెండ్ల్లినాటి ప్రమాణాలను త్రికరణశుద్ధ్దితో పాటిస్తానన్నాడు వరుడు ఉపేందర్.
పెండ్లి పెద్దలై..
ఈ ఆదర్శ వివాహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్, జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య, స్టేట్ హోం అధికారులంతా పెండ్లి పెద్దలయ్యారు. బాలల హక్కుల చైర్మన్ శ్రీనివాసరావు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ శైలజ, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి, ఆర్జేడీ శారద నూతన దంపతులను ఆశీర్వదించారు.
డబుల్బెడ్రూం మంజూరుకు కృషి ఆదర్శ వివాహాలతో సమ సమాజం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు లేని యువతి సింధును పెండ్లాడిన వరుడు ఉపేందర్‌ను మనసారా అభినందిస్తున్నాను. ఈ దంపతులకు డబుల్ బెడ్రూం మంజూరు చేసేందుకు నా వంతు కృషి చేస్తా.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
కుటుంబం లేని లోటు తీర్చారు
నాకు ఇన్నాళ్లు కుటుంబం లేదనే వెలితి ఉండేది. అది ఇవాళ తీరిపోయింది. కుటుంబం లేని లోటును తీర్చారు. మనసిచ్చిన ఉపేందర్‌తో .. ఘనంగా నాకు పెండ్లి చేసిన అధికారులను నేను ఎన్నటికీ మరువలేను. -వధువు సింధు
అమ్మను ఒప్పించి..
అమ్మను ఒప్పించి ప్రేమించిన సింధునే పెండ్లి చేసుకున్నా. నా ప్రేయసే నా ఇల్లాలైంది. నాకెంతో ఆనందంగా ఉంది. నా సహధర్మచారిణి సింధుకు ఏ కష్టం కలగనివ్వను..అపురూపంగా చూసుకుంటా. – వరుడు ఉపేందర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Government
- Lovers
- Officials
- Unite
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

