Golconda Bonalu | ఆషాఢ జాతర షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం
Golconda Bonalu | హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లంగర్ చౌరస్తాలో డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు.
Golconda Bonalu | హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాస బోనాలు మొదలయ్యాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. లంగర్ చౌరస్తాలో డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో తొట్లు, రథంతో ఊరేగింపుగా బోనాలను ప్రారంభించారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో కొండపైకి తొట్లు, రథం ఊరేగింపు నిర్వహించారు. పోతురాజులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నృత్యాలు చేయడం ఆకట్టుకుంది. హైదరాబాద్, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని అన్నారు.
ఇవాళ గోల్కొండలో మొదలైన ఈ బోనాలు 9 వారాల పాటు ఘనంగా జరుగుతాయి. మళ్లీ గోల్కొండ కోటలనే బోనాలు ముగుస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
బోనాలకు భారీ పోలీస్ బందోబస్తు : దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
గోల్కొండ బోనాల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం 600 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నామని, సీసీ కెమెరాల నిఘాలో బోనాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. గోల్కొండ కోటకు వచ్చే వారికి మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఉంటుందని, సెవన్ టూంబ్స్ వద్ద ఓ పార్కింగ్, లంగర్‌హౌస్ హుడా పార్కు వద్ద పార్కింగ్, రాందేవ్‌గూడ దాటిన తర్వాత ఓ పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయిస్తున్నామన్నారు. అంతేకాకుండా సెవన్ టూంబ్స్, రాందేవ్‌గూడల వైపు నుంచి వచ్చే వారికి పార్కింగ్ దగ్గర నుంచి కోట వరకు ఉచిత సెట్విన్ బస్సు, లంగర్‌హౌస్ హుడా పార్కు నుంచి వచ్చే వారి కోసం ఫ్రీ ఆటోలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్నట్లు డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో బోనాలను జరుపుకోవాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

