తిరిగేది కొద్దిగా.. రాసేది కొండంత!
మలక్‌పేట ట్రాన్స్ పోర్టు వాహనాల వినియోగం పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ అంతాఇంతా కాదు. ఆర్ఎఫ్సీ వాహనాలు కనీసం 20 కిలోమీటర్లు కూడా తిరగడం లేదు. కానీ, వాటి పేరిట ఏకంగా 25 లీటర్ల డీజిల్‌ను డ్రా చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. టిప్పర్ల విషయానికొస్తే గరిష్టంగా 15 కిలోమీటర్లు తిరిగితేనే ఎకువ, కానీ ప్రతి రోజూ 20 లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు లెకలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో టిప్పర్లు వీటికి రోజుకు 10 లీటర్ల వంతున ఇంధనం కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపుతున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ) మలక్‌పేట ట్రాన్స్ పోర్టు వాహనాల వినియోగం పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ అంతాఇంతా కాదు. ఆర్ఎఫ్సీ వాహనాలు కనీసం 20 కిలోమీటర్లు కూడా తిరగడం లేదు. కానీ, వాటి పేరిట ఏకంగా 25 లీటర్ల డీజిల్‌ను డ్రా చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. టిప్పర్ల విషయానికొస్తే గరిష్టంగా 15 కిలోమీటర్లు తిరిగితేనే ఎకువ, కానీ ప్రతి రోజూ 20 లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు లెకలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో టిప్పర్లు వీటికి రోజుకు 10 లీటర్ల వంతున ఇంధనం కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపుతున్నారు.
ఈ విధంగా వాహనాల పేరిట రోజుకు కనీసం 400 లీటర్లకు పైగా డీజిల్‌ను అదనంగా కాజేస్తున్నట్లు విజిలెన్స్ విభాగం ఆధారాలతో వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతీ వాహనం రోజుకు కనీసం 7 పాయింట్లను చేరుకోవాల్సి ఉండగా, కేవలం 2 పాయింట్లకు మాత్రమే వెళ్తూ మమ అనిపిస్తున్నట్లు ప్రధాన ఆరోపణ. మిగిలిన నిధులను యథేచ్ఛగా నొక్కేస్తున్నారన్న ప్రచారం బలంగా ఉంది. ముఖ్యంగా వందలాది వాహనాలు కాలం చెల్లి, లేదా మరమ్మతులకు గురై వర్ షాప్‌లు, షెడ్లకే పరిమితమయ్యాయి. విచిత్రమేమిటంటే.. రోడ్డెకని ఈ వాహనాలు క్రమం తప్పకుండా రోడ్లపై తిరిగినట్లు కాగితాల్లో లెకలు చూపిస్తూ, వాటి పేరిట డీజిల్, నిర్వహణ, ఇతర అద్దె బిల్లుల రూపంలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా గుంజేస్తున్నట్లు సమాచారం.
ఎఫ్ఆర్ఎస్ ఊసేది? అటెండెన్స్ లో ఇష్టారాజ్యం
మరో వైపు రవాణా విభాగంలోని కార్మికులు, డ్రైవర్లు, సంబంధిత సిబ్బంది అటెండెన్స్ నిర్వహణ పూర్తిగా గాడితప్పింది. ఫేస్ రికగ్నషన్ లేకపోవడమే శాపం. గతంలో ప్రవేశపెట్టాలని భావించిన ఫేస్ రికగ్నషన్ సిస్టమ్ విభాగానికి అమలుకు నోచుకోవడం లేదు. ఎఫ్ఆర్ఎస్ అమలు కాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని విధులకు రాని వారి పేరిట కూడా హాజరు నమోదు చేసి వేతనాలు మింగేస్తున్నట్లు తెలుస్తోంది. మాన్యువల్ కాగితాలకే ప్రాధాన్యమిస్తూ, లేదా ఒకరి స్థానంలో మరొకరు అటెండెన్స్ వేసే దుస్థితి నెలకొంది. ఇంత పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, హాజరు అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని తెలిసి కూడా, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం కొందరికి ఉపకరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రవాణా విభాగంలో విచారణ జరిపి అక్రమారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని పకాగా అమలు చేయాలని, ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డాగా మారిన జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని వెంటనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

