పన్ను.. పక్కాగా

- ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ మరిన్ని సంస్కరణలు
- కొత్తగా ప్రకటించిన 118 వాణిజ్య కారిడార్లలో సర్వే
- స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తరహాలో ఆస్తిపన్నుమదింపునకు ప్రత్యేక బృందాలు
- క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్ఏసీ ఇంజినీర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు
- భవన వినియోగాన్ని అనుసరించి పన్ను సవరింపు 120 కోట్ల ఆదనపు
- ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యం
బల్దియా ఖజానాను ఆర్థికంగా పరిపుష్టం చేసే దిశగా కసరత్తు మొదలైంది. ఆస్తిపన్ను వసూళ్లలో మరిన్ని సంస్కరణలు తెచ్చి మరింత ఆదాయాన్ని రాబట్టుకునేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 118 వాణిజ్య కారిడార్లలో సర్వే చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తరహాలో ఈ బృందంలోని సభ్యులు పని చేయనున్నారు.
ఎన్ఏసీ ద్వారా ఎంపికైన ఇంజినీర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు భవనాల వాస్తవ పరిస్థితి.. మదింపు జరిగిన విస్తీర్ణంతో పాటు నివాస గృహాలా లేక వాణిజ్య కేటగిరీలో ఉన్నాయో తేల్చేందుకు సర్వే చేపట్టనున్నారు. ఆస్తి పన్నునూ మదింపు చేయనున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనతో మొత్తంగా రూ.120 కోట్లను జీహెచ్ఎంసీ అదనంగా సమకూర్చుకోనున్నది.
నివాస కేటగిరిలో అనుమతి తీసుకుని వాణిజ్య, వ్యాపార లావాదేవీలకు వినియోగిస్తున్నారా..? జీ+ వరకు మాత్రమే అనుమతి తీసుకుని ఇష్టారాజ్యంగా అదనపు అంతస్తులు నిర్మించారా..? ఇలాంటి వారికి భారీ వడ్డన వేసేందుకు బల్దియా సిద్ధమైంది.
వంద శాతం జరిమానా విధించడంతో పాటు ఇంఫాక్ట్ చార్జీలను సైతం వసూళ్లు చేయనున్నది. ఇప్పటికే బల్దియా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. ప్రతి భవనాన్ని పక్కాగా కొలతలు వేసి.. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి పన్ను విధించనున్నారు. బీఆర్ఎస్లో దరఖాస్తు
చేసుకున్నా.. పన్ను పెనాల్టీ తప్పదు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టి సారించిన బల్దియాకు ఈ లెక్కన భారీగానే ఆదాయం సమకూరే అవకాశమున్నది.
- నిబంధనలు తప్పితే.. వడ్డన తప్పదు..!
- అదనపు ఆదాయానికి బల్దియా కసరత్తు
- కొత్తగా ప్రకటించిన 118 వాణిజ్య కారిడార్లలో సర్వే
- స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తరహాలో ఆస్తిపన్ను మదింపునకు ప్రత్యేక బృందాలు
- క్షేత్రస్థాయి పరిశీలనకు రంగంలోకి
- భవన వినియోగాన్ని బట్టి ఆస్తిపన్ను సవరింపు
- బీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నా.. పన్ను పెనాల్టీ తప్పదు
- ప్రతి చదరపు అడుగుకు 6శాతం అదనంగా వసూలు
- రూ.120కోట్ల మేర అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు
- గ్రేటర్‌లోని నాలాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగం
- కేటగిరీ మారితే భారీ వడ్డన
గ్రేటర్లో నివాస కేటగిరిలో అనుమతులు తీసుకొని వాణిజ్య, వ్యాపార లావాదేవీలకు వినియోగిస్తున్న భవనాల సంఖ్య తక్కువేమి కాదు. దీనికి తోడు గతంలో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌కు మాత్రమే అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా మారిన తర్వాత ఇష్టారీతిన అంతస్తులు పెంచి కట్టేవారు కూడా అధికంగానే ఉన్నారు. అయితే 118 కొత్త రోడ్లను కమర్షియల్‌గా నిర్థారించడంతో ఈ రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇలాంటి భవనాలపై భారీ వడ్డన తప్పకపోవచ్చు.
అనధికారికంగా అదనంగా నిర్మించిన భవనాలకు నూటికి నూరు శాతం జరిమానా కింద ఆస్తిపన్ను విధించడంతో పాటు ఇటీవల జారీ చేసిన జీవో మేరకు ఇంఫాక్ట్ చార్జీలను సైతం వసూళ్లు చేయనున్నారు. ఈ లెక్కన బల్దియాకు భారీగానే ఆదాయం సమకూరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నిధులను గ్రేటర్ పరిధిలోని నాలాల అభివృద్ధికి వినియోగించనున్నారు.
కొత్త వాణిజ్య కారిడార్‌లో అదనంగా ఇంఫాక్ట్ ఫీ ఇలా ..
కమర్షియల్ రోడ్లుగా మారిన ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణం చేపట్టే భవనాల్లో ఇంఫాక్ట్ ఫీ అదనంగా వసూలు చేయనున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు ప్రతి చదరపు అడుగుకు రూ.300 లేదా 6 శాతం అదనంగా వసూలు చేస్తారు. అంతకు మించి అంతస్థులకు మూడు శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ.150 చొప్పున వసూలు చేస్తారు. ఈ కేటగిరిలో మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, హోల్‌సేల్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, మోటారు రిపేర్ గ్యారేజీలు ఉంటాయి.
మరో కేటగిరిలో హాస్పిటల్స్, నర్సింగ్ హోంలు, విద్యాసంస్థలు, ప్రజా ఉపయోగ షాపులకు (500 గజాల లోపు ఉన్న భవనాల్లో) నివాస భవనాలు, వ్యాపార కార్యకలాపాలు ఉండే భవనాలకు ఇంఫాక్ట్ ఫీ ఇలా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు రెండు శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఆపై నిర్మించే అంతస్థులకు 1 శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ.50 చొప్పున
ఇంఫాక్ట్ ఫీ వసూలు చేస్తారు.
సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ) : ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బల్దియా ఖజానాను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తిపన్ను వసూళ్లలో మరిన్ని సంస్కరణల ద్వారా ఆదాయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన 118 కొత్త వాణిజ్య కారిడార్లలో సర్వే చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (ఎన్ఏసీ) ద్వారా ఎంపికైన ఇంజినీర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు , బిల్ కలెక్టర్లు ఈ బృందాల్లో ఉన్నారు. 118 మార్గాల్లో అన్ని భవనాలను సర్వే చేయనున్నారు.
ఈ వాణిజ్య కారిడార్లలోని భవనాల ఆస్తిపన్ను లెక్కింపు ద్వారా అదనంగా రూ.120 కోట్ల ఆదాయం పెంచుకోవాలన్న అంచనాతో ఈ క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. రంగంలోకి దిగిన ఈ బృందాలు భవనాల వాస్తవ విస్తీర్ణం ఎంత? ఇంతకు ముందు మదింపు ఎంత విస్తీర్ణానికి జరిగింది? వినియోగం నివాస కేటగిరీనా.. వాణిజ్య కేటగిరీలోనా.? అన్నది క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి గుర్తించనున్నారు. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తరహాలో ఆస్తిపన్ను మదింపునకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
క్షేత్రస్థాయి పరిశీలనలో లెక్కింపు ఇలా..
- ఆయా కారిడార్లలో క్షేత్రస్థాయి పరిశీలన చేసే బృందాలు పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
- భవనానికి నిర్మాణ అనుమతి ఉందా..? ఉంటే ఎన్ని అంతస్తులకు ఉంది..? ఎన్ని అంతస్తులు నిర్మించారు.
- భవనం మొత్తం విస్తీర్ణం ఎంత..? ఎంత విస్తీర్ణానికి పన్ను చెల్లిస్తున్నారు.. అని పరిశీలిస్తారు.
- భవనం కొలతలు తీసుకొని మదింపు సరిగా జరిగిందా? లేదా అన్నది తెలుసుకుంటారు.
- అనుమతి ఏ కేటగిరిలో తీసుకున్నారు? దేని కోసం వినియోగిస్తున్నారు? పన్ను చెల్లింపు ఏ కేటగిరిలో ఉన్నది చెక్ చేస్తారు.
- నివాస కేటగిరిలో అనుమతి తీసుకొని వాణిజ్య కేటగిరిలో వినియోగం ఉంటే ప్రభావ రుసుం (ఇంఫాక్ట్) విధించడంతో పాటు కమర్షియల్ కేటగిరీలో ఆస్తిపన్ను మదింపు చేస్తారు.
- అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా నిర్మాణాలు చేపట్టిన పక్షంలో ఆ అంతస్తులను అక్రమ నిర్మాణంగా భావించి 100శాతం అదనంగా ఆస్తిపన్ను విధిస్తారు.
- అనుమతి లేదని ఇప్పటికే బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ (బీఆర్ఎస్)లో దరఖాస్తు చేసుకున్నా.. పన్ను పెనాల్టీ తప్పదు.
- బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు అదనపు పన్ను చెల్లించాల్సిందే.
- ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆదాయం పెంపుపై దృష్టి సారించిన బల్దియా కొత్త వాణిజ్య కారిడార్లలోని భవనాలపై దృష్టి సారించింది.
- మొత్తం ఏరియా 650 స్కేర్ కిలోమీటర్లు
- ఆరు జోన్లు (ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, చార్మినార్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి)
- సర్కిళ్లు 30
- రెవెన్యూ డాకెట్స్ 344
- రెవెన్యూ స్టాఫ్ (బీసీఎస్, టీఐ, ఏఎంసీ, డీసీలు) కలిపి మొత్తం 510
- ప్రధాన కార్యాలయంలో కమిషనర్ పర్యవేక్షణలో అడిషనల్ కమిషనర్ (రెవెన్యూ), జాయింట్ కమిషనర్ (రెవెన్యూ), సీవీఓలు నిరంతరం ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్ష చేస్తారు.
- జోనల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్లు 30, వీవోలు 30 మంది, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు 150 మంది, బిల్ కలెక్టర్లు 344మంది ఆస్తిపన్ను వసూళ్లను రాబడుతారు.
- ఆస్తిపన్ను సేకరణ ఇలా ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు
- 17.23 లక్షల మంది నుంచి ఏటా దాదాపు రూ. 1450.47 కోట్లు ఆస్తిపన్ను వసూళ్ల రూపంలో ఆదాయాన్ని
- సమకూర్చుకుంటున్నది.
కేటగిరీల వారీగా పరిశీలిస్తే..
- రెసిడెన్షియల్ ప్రాపర్టీలు 14.59 లక్షలు, వీటి నుంచి ఏటా డిమాండ్ రూ.554.46 కోట్లు
- నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ 2.33 లక్షలు. డిమాండ్ రూ.790.03కోట్లు
- మిక్స్డ్ ప్రాపర్టీ 0.31 లక్షలు, డిమాండ్ రూ. 98.32 కోట్లు
- సూపర్ స్ట్రక్చర్ ప్రాపర్టీ 0.12 లక్షలు, డిమాండ్ రూ. 7.66కోట్లు
- కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ.20.68 కోట్లు
- రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి రూ.136.13కోట్ల మేర ఆస్తిపన్ను సేకరణ జరుగుతుంది.
- సిటీజన్ సర్వీస్ సెంటర్స్, హ్యాండ్ హోల్డ్ మిషిన్స్, ఆన్లైన్ పేమెంట్స్ (మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్), మీ సేవా సెంటర్లు, ఎన్ఈఎఫ్టీ (నిఫ్ట్) ట్రాన్స్ఫర్ రూపంలో ఆస్తిపన్ను చెల్లింపులకు అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ghmc property tax
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

