సీటీ కంపు కంపు.. గ్రేటర్లో ఎటు చూసినా చెత్త కుప్పలే!
గ్రేటర్లో పారిశుధ్యం గాడి తప్పింది.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్తా చెదారంలో దోమలు నివాసాలు ఏర్పర్చుకుంటున్నాయి. వాటి బారిన పడిన జనం జ్వరాలతో దవాఖానల్లో చేరుతున్నారు. ఉస్మానియా, ఫీవర్, గాంధీ దవాఖానల్లో సాధారణ రోజుల కంటే సుమారుగా 300 మంది ఒక్కో ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రైవేట్ క్లినిక్‌ల్లోనూ ఓపీల తాకిడి పెరుగుతున్నది.
- పారిశుధ్య నిర్వహణలో అలసత్వం
- అటకెక్కిన తడి-పొడి చెత్త సేకరణ
- అమలుకు నోచుకోని జీవీపీ పాయింట్ల ఎత్తివేత
- రహదారులు, కాలనీల్లో రోడ్లపైనే చెత్త
- కాగితాలకే పరిమితమవుతున్న స్పెషల్ డ్రైవ్
- ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా నెరవేరని చెత్త రహిత నగర లక్ష్యం
సిటీబ్యూరో, నవంబరు 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో (GHMC) పారిశుధ్యం గాడి తప్పింది.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చెత్తా చెదారంలో దోమలు నివాసాలు ఏర్పర్చుకుంటున్నాయి. వాటి బారిన పడిన జనం జ్వరాలతో దవాఖానల్లో చేరుతున్నారు. ఉస్మానియా, ఫీవర్, గాంధీ దవాఖానల్లో సాధారణ రోజుల కంటే సుమారుగా 300 మంది ఒక్కో ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రైవేట్ క్లినిక్‌ల్లోనూ ఓపీల తాకిడి పెరుగుతున్నది.
పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని జీహెచ్ఎంసీ ప్రకటనలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కాలనీలు, రహదారులపై చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్త సమస్యపై అటు కార్పొరేటర్లు, ఇటు సోషల్ మీడియా వేదికగా ప్రజలు చెబుతున్నప్పటికీ అధికారుల్లో ఏ మాత్రం చర్యలు చేపట్టడం లేదు..కనీసం జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయంగా డంపింగ్ యార్డులను కొత్తగా తీసుకురాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. పారిశుధ్య నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా లక్ష్యాన్ని మాత్రం
సాధించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సిటీలో రహదారుల వెంట ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి.. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజి వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2,640 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధి కారులు చెబుతుంటే తప్ప క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ సరిగా చేయడం లేదు. ఉప్పల్ చిలుకానగర్ నుంచి నాచారం మెయిన్ రోడ్, కవాడిగూడ ప్రధాన రహదారి, బన్సీలాల్‌పేట, ముషీరాబాద్, షేక్‌పేట దర్గా, ఓయూ కాలనీలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ ప్రధాన రహదారి, పర్వత్నగర్తో పాటు పాతబస్తీలోని 70 శాతం ప్రాంతాల్లో అపరిశుభ్రత దర్శనమిస్తుంది.
చార్మినార్,గుల్జార్ హౌస్ వెళ్లే దారిలో చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. ఎర్రగడ్డ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో కుప్పలు కుప్పలుగా చెత్త, ఇతర వ్యర్థాలతో ముక్కు పుటలదిరేలా దుర్వాసన వస్తుందని స్థానికులు చెబుతున్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజు పర్యటించాలి.. కానీ అదెక్కడా జరగడం లేదు. జోనల్ కమిషనర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది డిప్యూటీ కమిషనర్లు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో పదకొండు దాటిన జీవీపీ పాయింట్లు గుట్టగుట్టలుగా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పారిశుధ్య సిబ్బంది సక్రమంగా విధులకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విచ్చల విడిగా డంపర్బిన్లు..
బీఆర్ఎస్ హయాంలో డస్ట్ బిన్లు ఎత్తి వేసి చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దగా..ప్రస్తుతం డంపర్ బిన్లు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. డస్ట్ బిన్ లెస్ సిటీగా మార్చడంలో జీహెచ్ఎంసీ విఫలం చెందింది. నిర్వహణలో మళ్లీ డస్ట్ బిన్ల తరహాలో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నది. రేకులతో దుకాణం మాదిరిగా షెడ్డు ఏర్పాటు చేసి అందులో చెత్త వేస్తే బయటకు కనిపించకుండా ఉండేలా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి గార్భేజ్ వెహికల్స్‌లో చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించనున్నారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో ఒక్కొక్క పాయింట్ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్..
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను తుంగలో తొక్కుతున్నది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో చెత్త వ్యర్థాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది.అయితే మరో చోట చెత్తను డంప్ చేసేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో జీహెచ్ఎంసీ యథావిధిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తోంది.
- జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు ప్రతి రోజు 9,684 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధి నుంచే 8,500 మెట్రిక్ టన్నులు, ఇతర 14 మున్సిపాలిటీల నుంచి చెత్తను తరలిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఫ్యారా నగర్, లక్డారం, ఖానాపూర్‌లో అనుకున్నప్పటికీ పురోగతి లేకపోవడంతో జవహర్‌నగర్‌లోనే చెత్తను గుట్టగుట్టలుగా పారబోస్తున్నారు. తద్వారా పరిసర 30 గ్రామాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నాయి.
- గతంలో సీఆర్ఎంపీతో పాటు కాలనీల్లోని ప్రధాన రహదారులపై యంత్రాలతో స్వీపింగ్ జరిగేది. యంత్రాల వినియోగం నిలిపివేయడంతో రోడ్లపైనా కార్మికులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డు ప్రమాదాల్లో కార్మికులు మృతి చెందుతుండడం ఆందోళన కలిగించే అంశం.
- గ్రేటర్లో ఒక్కో గ్రూపులో ఏడుగురు చొప్పున 2,651 గ్రూపుల్లో 18,557 మంది పారిశుధ్య కార్మికులున్నారు. 9,103 కిలోమీటర్ల రహదారులపై వీరు స్వీపింగ్ చేయాల్సి ఉంది. మరణించడం, అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో 1,578 మంది విధులకు హాజరు కావడం లేదు.
- కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నా..నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

