Ronald Ross | ప్రశాంతంగా పోలింగ్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్
జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.
Ronald Ross | సిటీబ్యూరో, మే 13, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఆయా రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని, అకడకడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, వెంటనే వాటిని సంబంధిత ఇంజినీర్స్‌తో సరిచేసినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మొఘల్ పుర హరిబౌలి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. అంతకు ముందు మాదాపూర్‌లోని వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో రొనాల్డ్ రాస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హకును వినియోగించుకున్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో (జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో) ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేశారు.
తన దృష్టికి వచ్చే అంశాలపై అధికారులను అప్రమత్తం చేశారు. ఓటరు హెల్ఫ్ లైన్ ఫిర్యాదు కేంద్రాన్ని, ఎంసీసీ కేంద్రంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఫిర్యాదులు వచ్చాయా అంటూ ఆరా తీశారు. ఆయా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగిందని తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలతో పాటు పోలింగ్ సిబ్బ ంది ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ వద్దకు పూర్తి బందోబస్తుతో సెక్టర్ ఆఫీసర్‌తో కలిసి సిబ్బంది క్షేమంగా చేరుకున్నారు.. అకడ పోలైన ఓట్ల పూర్తి సమాచారంతో సెక్టార్ వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తీసుకొని ఎన్నికల నియమావళి ప్రకారంగా నివేదిక అందజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

