బల్దియా బడ్జెట్ రూ. 6,841.87 కోట్లు

- ఆమోదం తెలిపిన కౌన్సిల్
- జీహెచ్ఎంసీ, ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృత చర్చ
- సూచనలు స్వీకరణ.. అనంతరం ఆమోదం
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2021-22 వార్షిక బడ్జెట్ రూ.6,841.87కోట్లుగా నిర్ధారించగా.. మంగళవారం వర్చువల్‌గా జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బడ్జెట్‌ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రవేశపెట్టగా, బడ్జెట్లోని వివరాలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సమావేశంలో వివరించారు. ఈ బడ్జెట్‌పై విస్తృతంగా జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేశ్‌కుమార్, ఫైనాన్స్ విభాగం అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనేడి సమాధానాలు ఇచ్చారు. ఈ చర్చలో సభ్యులు పలు సూచనలు చేశారు. అనంతరం బడ్జెట్‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
బడ్జెట్ వివరాలు
- జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5600కోట్లు కాగా, ప్రభుత్వానికి సంబంధించి డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి వేరుగా రూ.1241.87కోట్లు కేటాయించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,414 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ. 3,186 కోట్లు , ఇక హౌజింగ్ కార్పొరేషన్ నుంచి వచ్చే బడ్జెట్ రూ.1241.87 కోట్లుగా నిర్ణయించారు.
- రెవెన్యూ ఆదాయం రూ. 3571 కోట్లు కాగా మూలధనం ఆదాయం రూ.983.04 కోట్లు
- ఇక రెవెన్యూ ఆదాయాన్ని పరిశీలిస్తే అధిక ఆస్తిపన్ను రూపంలో రూ.1850కోట్లు(32శాతం) లభిస్తుంది.
- 15వ ఫైనాన్స్ కమీషన్ కింద రూ. 355 కోట్లు
- 2021-22 సంవత్సరానికిగాను ప్రభుత్వం ద్వారా నిధులు వస్తాయని అంచనా వేసింది. కౌన్సిల్ ఆమోదించిన 2021-22 వార్షిక బడ్జెట్ రూ. 6,841.87కోట్లు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC Budget
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

